Virat Kohli Signed Jersey: కోహ్లీ కానుక పదిలంగా
ABN , Publish Date - Aug 10 , 2025 | 05:51 AM
టీమిండియా పేసర్ సిరాజ్‌కు విరాట్ కోహ్లీ అంటే ప్రత్యేక అభిమానం. తాను ఆర్‌సీబీకి ఆడిన సమయంలో అతడిని హైదరాబాద్‌లోని స్వగృహానికి సైతం తీసుకెళ్లి...
హైదరాబాద్: టీమిండియా పేసర్ సిరాజ్‌కు విరాట్ కోహ్లీ అంటే ప్రత్యేక అభిమానం. తాను ఆర్‌సీబీకి ఆడిన సమయంలో అతడిని హైదరాబాద్‌లోని స్వగృహానికి సైతం తీసుకెళ్లి పసందైన విందు భోజనంతో ఖుషీ చేయించాడు. అటు విరాట్ కూడా సిరాజ్‌పై తనకున్న ఆప్యాయతను పలు సందర్భాల్లో వెల్లడిస్తుంటాడు. అందుకే తానాడిన చివరి టెస్టు జెర్సీని సిరాజ్‌కే కానుకగా ఇచ్చాడు. విరాట్ సంతకంతో కూడిన ఈ జెర్సీని సిరాజ్ ప్రత్యేకంగా ఫ్రేమ్ చేయించి మరీ తన ఇంట్లో గోడకు బిగించాడు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళల రక్షణ మా బాధ్యత.. సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డి రాఖీ శుభాకాంక్షలు
పులివెందుల ఎన్నికలో వైసీపీ నేతలు అవకతవకలకు పాల్పడుతున్నారు: బీటెక్ రవి