Kohli Set to Play in Vijay Hazare: హజారే లో కోహ్లీ
ABN , Publish Date - Dec 12 , 2025 | 05:47 AM
ప్రతిష్ఠాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగనున్నాడు. ఈమేరకు గురువారం ప్రకటించి...
ఢిల్లీ ప్రాబబుల్స్‌లో చోటు
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగనున్నాడు. ఈమేరకు గురువారం ప్రకటించిన ఢిల్లీ ప్రాబబుల్స్‌లో విరాట్‌తోపాటు కీపర్ రిషభ్ పంత్‌నూ ఎంపిక చే శారు. 2027 వన్డే ప్రపంచ కప్‌లో ఆడాలని భావిస్తున్న కోహ్లీ..విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనడం ద్వారా 50 ఓవర్ల ఫార్మాట్‌లో ప్రస్తుత తన అద్భుత ఫామ్‌ను కొనసాగించాలని భావిస్తున్నాడు. 37 ఏళ్ల విరాట్ 2010లో చివరిసారి విజయ్ హజారేలో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించాడు. ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌ని ఆంధ్రతో ఆడనుంది.
ఇవీ చదవండి:
సహచరుడికి ఇచ్చిన మాట..15 ఏళ్ల తర్వాత నిలబెట్టుకున్న సచిన్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. నెం.2గా కోహ్లీ