KL Rahul: రాహుల్‌కు వన్డే పగ్గాలు
ABN , Publish Date - Nov 24 , 2025 | 06:10 AM
దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పితో బాధపడుతుండగా.. అతడి స్థానంలో జట్టు పగ్గాలు...
గిల్ అవుట్‌ఫ బుమ్రాకు విశ్రాంతి
దక్షిణాఫ్రికాతో వన్డేలకు భారత జట్టు
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పితో బాధపడుతుండగా.. అతడి స్థానంలో జట్టు పగ్గాలు కేఎల్ రాహుల్‌కు అప్పగించారు. ఈనెల 30 నుంచి డిసెంబరు 6 వరకు జరిగే సిరీస్ కోసం సెలెక్టర్లు 15 మందితో కూడిన జాబితాను ఆదివారం వెల్లడించారు. ఇటీవల ఆస్ర్టేలియా పర్యటనకు వెళ్లిన వన్డే జట్టు నుంచి నాలుగు మార్పులు చేశారు. కీపర్ రిషభ్ పంత్ జట్టులోకి వచ్చాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా గాయంతో దూరం కావడంతో రాహుల్‌కు డిప్యూటీగా పంత్ వ్యవహరించనున్నాడు. అలాగే శ్రేయాస్ అయ్యర్ స్థానంలో హైదరాబాదీ తిలక్ వర్మకు చోటు దక్కింది. రెండేళ్ల క్రితం తను భారత్ తరఫున చివరి వన్డే ఆడాడు. ఇటీవల భారత్ ‘ఎ’ తరఫున ఆడి ఫామ్ నిరూపించుకున్న రుతురాజ్ గైక్వాడ్ కూడా జట్టులోకి వచ్చాడు. శ్రేయాస్ స్థానం కోసం ఈ ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. అయితే ఆసీస్ పర్యటనలో రాణించినప్పటికీ స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో వెటరన్ జడేజాను తీసుకున్నారు. పేసర్ సిరాజ్ మాత్రం ఆ టూర్‌లో ఆడిన మూడు వన్డేల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీయడంతో తనను పరిగణనలోకి తీసుకోలేదు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. పంత్ జట్టులో ఉన్నా ధ్రువ్ జురెల్‌కు సెలెక్టర్లు అవకాశం ఇవ్వడం విశేషం. స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా మరోసారి నితీశ్ కుమార్‌తో కొనసాగనున్నారు.
వన్డే జట్టు
రాహుల్ (కెప్టెన్), రోహిత్, విరాట్ కోహ్లీ, జైస్వాల్, తిలక్, రుతురాజ్, జురెల్, పంత్, సుందర్, జడేజా, కుల్దీప్, నితీశ్, హర్షిత్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్.
ఇవీ చదవండి:
అంధ మహిళల టీ20 ప్రపంచకప్ భారత్‌దే.. జట్టుపై అభినందనలు..
ఊహించని పరిణామం.. స్మృతి మంధాన పెళ్లి వాయిదా..