India A vs Australia A: రాహుల్ సుదర్శన్ శతకాలు
ABN , Publish Date - Sep 27 , 2025 | 05:20 AM
ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో జరిగిన రెండో అనధికార టెస్టులో భారత్ ‘ఎ’ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. కేఎల్ రాహుల్ (176 నాటౌట్), సాయి సుదర్శన్ (100) శతకాలతో...
భారత్ ‘ఎ’దే సిరీస్
లఖ్‌నవూ: ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో జరిగిన రెండో అనధికార టెస్టులో భారత్ ‘ఎ’ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. కేఎల్ రాహుల్ (176 నాటౌట్), సాయి సుదర్శన్ (100) శతకాలతో రాణించారు. ఈ ఫలితంతో సిరీ్‌సను సైతం 1-0తో భారత్ దక్కించుకుంది. 412 పరుగుల భారీ ఛేదన కోసం బరిలోకి దిగిన భారత్ ‘ఎ’ ఆఖరిదైన నాలుగో రోజు శుక్రవారం 5 వికెట్లకు 413 పరుగులు చేసి నెగ్గింది. దేశవాళీ క్రికెట్‌లో ఇది ఆరో అతిపెద్ద విజయం. కెప్టెన్ జురెల్ (56) అర్ధసెంచరీ సాధించాడు. ఆసీస్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 420, భారత్ ‘ఎ’ 194 పరుగులు చేయగా.. ఆసీస్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు కుప్పకూలింది.
ఇవి కూడా చదవండి..
మండలిలో అచ్చెన్న, బొత్స మధ్య మాటల యుద్ధం
Read latest AP News And Telugu News