రాహుల్ అభిమన్యు అర్ధ శతకాలు
ABN , Publish Date - Jun 09 , 2025 | 05:22 AM
ఇంగ్లండ్‌తో మొదటి టెస్ట్‌కు ఓపెనర్ రేస్‌లో నిలిచిన కేఎల్ రాహుల్ మరోసారి సత్తా చాటాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో రెండో అనధికార టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో శతక్కొట్టిన రాహుల్..రెండో ఇన్నింగ్స్‌లోనూ భళా అనిపించాడు...
భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్ 163/4
లయన్స్ తొలి ఇన్నింగ్స్ 327 ఆలౌట్
నాలుగు వికెట్లతో చెలరేగిన ఖలీల్
నార్తాంప్టన్: ఇంగ్లండ్‌తో మొదటి టెస్ట్‌కు ఓపెనర్ రేస్‌లో నిలిచిన కేఎల్ రాహుల్ మరోసారి సత్తా చాటాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో రెండో అనధికార టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో శతక్కొట్టిన రాహుల్..రెండో ఇన్నింగ్స్‌లోనూ భళా అనిపించాడు. రాహుల్ (51), కెప్టెన్ అభిమన్యు ఈశ్వన్ (80) అర్ధ శతకాలతో మెరవడంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆదివారం ఆఖరికి భారత్ ‘ఎ’ 163/4 స్కోరు చేసింది. రాహుల్, ఈశ్వరన్ రెండో వికెట్‌కు 88 పరుగులు జోడించారు. క్రిస్ వోక్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా..మొదటి ఇన్నింగ్స్‌లో లభించిన 21 పరుగులతో కలిపి..భారత్ ‘ఎ’ మొత్తం 184 రన్స్ ఆధిక్యంలో నిలిచింది. పర్యాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 348 రన్స్ చేసింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 192/3తో మూడో రోజు..మొదటి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ లయన్స్ 327 పరుగులకు ఆలౌటైంది. పేసర్ ఖలీల్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో (4/70) ప్రత్యర్థి బ్యాటర్ల పనిబట్టాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి