Share News

క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌

ABN , Publish Date - Jan 31 , 2025 | 03:10 AM

కిడాంబి శ్రీకాంత్‌, యువ ఆటగాడు ఎస్‌.సుబ్రమణియన్‌ థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టారు....

క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌

థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌

బ్యాంకాక్‌ : కిడాంబి శ్రీకాంత్‌, యువ ఆటగాడు ఎస్‌.సుబ్రమణియన్‌ థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టారు. గురువారం జరిగిన రౌండ్‌-16 మ్యాచ్‌లో శ్రీకాంత్‌ 21-19, 21-15తో గుణవన్‌ (హాంకాంగ్‌)ని ఓడించాడు. మరో ప్రీక్వార్టర్స్‌ పోరులో 21 ఏళ్ల సుబ్రమణియన్‌ 9-21, 21-10, 21-17తో చికో ఆరా ద్వి (ఇండోనేసియా)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్‌లో రక్షిత రామ్‌రాజ్‌ 21-15, 21-12తో టాంగ్‌ (తైపీ)పై విజయంతో క్వార్టర్స్‌ చేరింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రీక్వార్టర్స్‌లో రుత్వికా శివాని గద్దె/రోహన్‌ ద్వయం 19-21 15-21తో థాయ్‌లాండ్‌ జోడీ రచపోల్‌/లీ సువాన్‌ చేతిలో ఓటమి పాలైంది.


ఇదీ చదవండి:

నాలుగో టీ20.. టీమిండియాకు సూపర్ న్యూస్.. మహాబలుడు వచ్చేస్తున్నాడు

కోహ్లీని భయపెట్టిన ఉపేంద్ర.. సొంతగడ్డపై అంతా చూస్తుండగానే..

ఎప్పుడూ చూడని రనౌట్.. ఇంతకంటే దురదృష్టవంతుడు ఉండడు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 31 , 2025 | 03:10 AM