Share News

ఖవాజా ‘డబుల్‌’

ABN , Publish Date - Jan 31 , 2025 | 03:19 AM

ఓపెనర్‌ ఖవాజా (232) తొలి ద్విశతకంతో చెలరేగగా..అరంగేట్ర ఆటగాడు జోష్‌ ఇన్‌గ్లి్‌స (94 బంతుల్లో 102) మెరుపు శతకంతో కదం తొక్కడంతో శ్రీలంకతో మొదటి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌ను...

ఖవాజా ‘డబుల్‌’

ఇన్‌గ్లి్‌స మెరుపు శతకం

ఆస్ట్రేలియా 654/6 డిక్లేర్డ్‌

గాలె : ఓపెనర్‌ ఖవాజా (232) తొలి ద్విశతకంతో చెలరేగగా..అరంగేట్ర ఆటగాడు జోష్‌ ఇన్‌గ్లి్‌స (94 బంతుల్లో 102) మెరుపు శతకంతో కదం తొక్కడంతో శ్రీలంకతో మొదటి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌ను ఆస్ట్రేలియా 654/6 భారీ స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. ఓవర్‌నైట్‌స్కోరు 330/2తో రెండోరోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసీస్‌ తొలుత స్మిత్‌ (141) వికెట్‌ను కోల్పోయింది. ఖవాజాతో కలిసి మూడో వికెట్‌కు స్మిత్‌ 266 పరుగులు జోడించాడు. అనంతరం..ఇన్‌గ్లి్‌సతో కలిసి నాలుగో వికెట్‌కు 146 పరుగులు జత చేశాడు. ఇక..మొదటి ఇన్నింగ్స్‌లో గురువారం ఆట నిలిపి వేసే సమయానికి శ్రీలంక 44/3 స్కోరుతో ఇక్కట్లలో పడింది.


స్టార్క్‌ 700 వికెట్లు..: గురువారం తన 35వ జన్మదినం రోజున ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఓపెనర్‌ కరుణరత్నేను అవుట్‌ చేసిన అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో 700వ వికెట్‌ ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్‌ల్లో స్టార్క్‌కిది 377వ వికెట్‌కాగా, వన్డేలలో 244, టీ20లలో 79 వికెట్లు పడగొట్టాడు. షేన్‌ వార్న్‌, మెక్‌గ్రాత్‌, బ్రెట్‌ లీ తర్వాత అత్యధిక అంతర్జాతీయ వికెట్లు సాధించిన నాలుగో ఆస్ట్రేలియా బౌలర్‌గా స్టార్క్‌ రికార్డులకెక్కాడు.


ఇదీ చదవండి:

నాలుగో టీ20.. టీమిండియాకు సూపర్ న్యూస్.. మహాబలుడు వచ్చేస్తున్నాడు

కోహ్లీని భయపెట్టిన ఉపేంద్ర.. సొంతగడ్డపై అంతా చూస్తుండగానే..

ఎప్పుడూ చూడని రనౌట్.. ఇంతకంటే దురదృష్టవంతుడు ఉండడు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 31 , 2025 | 03:19 AM