England tour: నాయర్‌కు ఇక నో
ABN , Publish Date - Jul 15 , 2025 | 04:57 AM
దేశవాళీ పోటీల్లో పరుగుల వరద పారిస్తుండడంతో వయసు (34) కూడా చూడకుండా అవకాశాలిస్తే వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇంగ్లండ్‌తో...
మూడు టెస్ట్‌ల్లోనూ విఫలం సాయి సుదర్శన్‌కు చాన్స్ ?
న్యూఢిల్లీ : దేశవాళీ పోటీల్లో పరుగుల వరద పారిస్తుండడంతో వయసు (34) కూడా చూడకుండా అవకాశాలిస్తే వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇంగ్లండ్‌తో ప్రస్తుత సిరీస్ లోని మూడు టెస్టుల్లో వరుసగా 0, 20, 31, 26, 40, 14 స్కోర్లతో కనీసం ఒక్క ఫిఫ్టీ కూడా చేయలేకపోయాడు. 22 కంటే తక్కువ సగటుతో మూడు టెస్ట్‌ల్లో కలిపి 131 రన్స్ మాత్రమే చేశాడు. పైగా..బ్యాటింగ్ టెక్నిక్‌లో లోపాలు లేకపోలేదు. ఇవన్నీ చూస్తుంటే వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ తన కెరీర్‌లో ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడేసినట్టే కనిపిస్తోంది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన కరుణ్..ఇంగ్లండ్ పర్యటనను ప్రశంసనీయ రీతిలోనే ఆరంభించాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేయడం ద్వారా టెస్ట్ తుది జట్టులో తనకు చోటు కల్పించక తప్పని పరిస్థితి కల్పించాడు. కానీ పేలవ ప్రదర్శనతో సెలెక్టర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. భారత టెస్ట్ జట్టు భావి ఆటగాడిగా విశ్లేషకులు అంచనా వేస్తున్న 21 ఏళ్ల సాయి సుదర్శన్‌కు నాలుగో టెస్ట్‌లో అవకాశం ఇవ్వడమే సబబని మాజీ సెలెక్టర్ దేవంగ్ గాంధీ, మాజీ కీపర్ దీప్‌దాస్ గుప్తా అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి