Share News

జ్యోతి ‘రికార్డు’ స్వర్ణం

ABN , Publish Date - Jan 27 , 2025 | 03:07 AM

తెలుగు అథ్లెట్‌ జ్యోతి యర్రాజి ఈ ఏడాది పోటీపడ్డ తొలి రేసులోనే సత్తా చాటింది. ఫ్రాన్స్‌లోని నాన్‌టె్‌సలో జరిగిన ఎలీట్‌ ఇండోర్‌ మీటింగ్‌ టోర్నీలో విశాఖపట్నానికి చెందిన జ్యోతి 60 మీటర్ల హర్డిల్స్‌లో..

జ్యోతి  ‘రికార్డు’ స్వర్ణం

విశాఖపట్నం స్పోర్ట్స్‌ (ఆంధ్రజ్యోతి): తెలుగు అథ్లెట్‌ జ్యోతి యర్రాజి ఈ ఏడాది పోటీపడ్డ తొలి రేసులోనే సత్తా చాటింది. ఫ్రాన్స్‌లోని నాన్‌టె్‌సలో జరిగిన ఎలీట్‌ ఇండోర్‌ మీటింగ్‌ టోర్నీలో విశాఖపట్నానికి చెందిన జ్యోతి 60 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణం సాధించింది. అది కూడా జాతీయ రికార్డు టైమింగ్‌తో విజేతగా నిలిచింది. వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఇండోర్‌ టూర్‌ లెవెల్‌ మీట్‌లో భాగంగా జరిగిన ఈ రేసులో జ్యోతి రెండుసార్లు తన జాతీయ రికార్డును అధిగమించడం విశేషం. తొలుత హీట్స్‌లో 8.07 సెకన్ల టైమింగ్‌ నమోదు చేసిన జ్యోతి.. ఫైనల్స్‌లో ఏకంగా 8.04 సెకన్లలోనే గమ్యాన్ని చేరుకుంది. ఈ క్రమంలో గతంలో తన పేరిటనున్న 8.12 సెకన్ల ప్రదర్శనను జ్యోతి మరింత మెరుగుపరచుకుంది.


అయితే, ఈ ఏడాది మార్చిలో చైనాలో జరిగే ప్రపంచ ఇండోర్‌ చాంపియన్‌షి్‌పకు అర్హత మార్క్‌ 7.84 సెకన్ల టైమింగ్‌ను మాత్రం ఇంకా అందుకోవాల్సి ఉంది. ఇక, ఇదే టోర్నీ పురుషుల 60 మీటర్ల హర్డిల్స్‌ ఈవెంట్‌లో భారత అథ్లెట్‌ తేజాస్‌ షిర్సే 7.68 సెకన్ల టైమింగ్‌తో కాంస్య పతకం అందుకున్నాడు.


ఇదీ చదవండి:

క్రికెట్‌లో ఇలాంటి సెలబ్రేషన్ ఎప్పుడూ చూసుండరు.. గాల్లో పల్టీలు కొడుతూ

నితీష్‌తో ఆడుకుంటున్న గంభీర్.. తెలుగోడి కెరీర్‌కు డేంజర్

ఆ భయం ఇంకా వెంటాడుతోంది.. గిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 27 , 2025 | 03:07 AM