Justin Greaves double century: గ్రీవ్స్ అజేయ డబుల్
ABN , Publish Date - Dec 07 , 2025 | 06:14 AM
జస్టిన్ గ్రీవ్స్ (202 నాటౌట్) ద్విశతక పోరాటంతో.. న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో వెస్టిండీస్ డ్రాతో గట్టెక్కింది. 531 పరుగుల లక్ష్య ఛేదనలో.. ఆటకు ఐదో, ఆఖరి రోజు ఓవర్‌నైట్ స్కోరు...
కివీ్‌స-విండీస్ తొలి టెస్ట్ డ్రా
క్రైస్ట్‌చర్చ్: జస్టిన్ గ్రీవ్స్ (202 నాటౌట్) ద్విశతక పోరాటంతో.. న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో వెస్టిండీస్ డ్రాతో గట్టెక్కింది. 531 పరుగుల లక్ష్య ఛేదనలో.. ఆటకు ఐదో, ఆఖరి రోజు ఓవర్‌నైట్ స్కోరు 212/4 స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ 6 వికెట్లకు 457 పరుగులు సాధించింది. షాయ్ హోప్ (140), కీమర్ రోచ్ (58 నాటౌట్) రాణించారు. జాకబ్ డఫీ మూడు వికెట్లు పడగొట్టాడు. కివీస్ 231, 466/8 డిక్లేర్ చేయగా.. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులకు ఆలౌటైంది. కాగా, ఐదు రోజుల టెస్ట్‌ల్లో నాలుగో ఇన్నింగ్స్‌లో విండీస్ చేసిన 457 పరుగులే అత్యధిక స్కోరు కావడం విశేషం.
ఈ వార్తలు కూడా చదవండి..
సౌతాఫ్రికా ఆలౌట్.. భారత్ టార్గెట్ 271
రికార్డు సృష్టించిన క్వింటన్ డికాక్