Share News

Justice Nageswara Rao: బిహార్‌ క్రికెట్‌ సంఘం అంబుడ్స్‌మన్‌గా జస్టిస్‌ నాగేశ్వర రావు

ABN , Publish Date - Aug 13 , 2025 | 01:59 AM

రిటైర్డ్‌ జడ్జి లావు నాగేశ్వర రావును బిహార్‌ క్రికెట్‌ సంఘం (బీసీఏ) అంబుడ్స్‌మన్‌గా సుప్రీం కోర్టు నియమించింది. బీసీఏలోని కొందరు ఆఫీస్‌ బేరర్లు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల కేసుపై విచారణ చేపట్టిన...

Justice Nageswara Rao: బిహార్‌ క్రికెట్‌ సంఘం అంబుడ్స్‌మన్‌గా జస్టిస్‌ నాగేశ్వర రావు

న్యూఢిల్లీ: రిటైర్డ్‌ జడ్జి లావు నాగేశ్వర రావును బిహార్‌ క్రికెట్‌ సంఘం (బీసీఏ) అంబుడ్స్‌మన్‌గా సుప్రీం కోర్టు నియమించింది. బీసీఏలోని కొందరు ఆఫీస్‌ బేరర్లు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల కేసుపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఆ రాష్ట్ర సంఘంలో క్రికెట్‌ కార్యకలాపాలు సవ్యంగా సాగేందుకు వీలుగా నాగేశ్వర రావు నియామకంపై ఆదేశాలు జారీ చేస్తున్నట్టు తెలిపింది. గతంలో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం కూడా అవినీతి సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు క్రికెట్‌ కార్యకలాపాల నిర్వహణ కోసం నాగేశ్వర రావు నేతృత్వంలో ఏకసభ్య కమిటీని సుప్రీం కోర్టు నియమించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 13 , 2025 | 01:59 AM