Test Batter Rank: రూట్ నెం.1 రికార్డు
ABN , Publish Date - Jul 17 , 2025 | 04:23 AM
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. బ్యాటర్ల జాబితాలో గతవారం హ్యారీ బ్రూక్‌కు టాప్ ర్యాంక్‌ను కోల్పోయిన రూట్.. బుధవారం ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో...
బౌలర్లలో టాప్‌లోనే బుమ్రా
టెస్టు ర్యాంకింగ్స్
దుబాయ్: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. బ్యాటర్ల జాబితాలో గతవారం హ్యారీ బ్రూక్‌కు టాప్ ర్యాంక్‌ను కోల్పోయిన రూట్.. బుధవారం ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠాన నిలిచాడు. ఈ క్రమంలో 2014 డిసెంబరులో సంగక్కర (37 ఏళ్ల వయసులో) తర్వాత టెస్టుల్లో నెంబర్‌వన్‌గా నిలిచిన పెద్ద వయసు బ్యాటర్‌గా 34 ఏళ్ల రూట్ రికార్డుకెక్కాడు. ఇక, ఇప్పటిదాకా టాప్‌లో ఉన్న బ్రూక్ మూడో స్థానానికి పడిపోయాడు. కేన్ విలియమ్సన్ మూడు నుంచి రెండో ర్యాంక్‌కు ఎగబాకాడు. భారత బ్యాటర్లలో యశస్వీ జైస్వాల్ 5, పంత్ 8, గిల్ 9వ ర్యాంకుల్లో ఉన్నారు. కేఎల్ రాహుల్ ఐదు స్థానాలు మెరుగై 35వ ర్యాంక్‌కు చేరాడు. ఇక, లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించినా, ర్యాంకింగ్స్‌లో మాత్రం టీమిండియా స్టార్ జస్‌ప్రీత్ బుమ్రా అగ్రస్థానం చెక్కు చెదరలేదు. బుమ్రా బౌలర్ల జాబితాలో నెంబర్‌వన్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రబాడ రెండో ర్యాంక్‌లో ఉన్నాడు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి