Share News

World Boxing Championships: ఫైనల్‌కు జైస్మిన్‌

ABN , Publish Date - Sep 13 , 2025 | 02:49 AM

ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌ప్సలో భారత బాక్సర్‌ జైస్మిన్‌ లంబోరియా ఫైనల్‌ చేరింది. మహిళల 57 కిలోల విభాగం సెమీస్‌లో జైస్మిన్‌ 5-0తో ఒమైలిన్‌ అల్కాలా (వెనెజులా)ను చిత్తుచేసి..

World Boxing Championships: ఫైనల్‌కు జైస్మిన్‌

సెమీస్‌లో మీనాక్షి ఫ ప్రపంచ బాక్సింగ్‌

లివర్‌పూల్‌ (ఇంగ్లండ్‌): ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌ప్సలో భారత బాక్సర్‌ జైస్మిన్‌ లంబోరియా ఫైనల్‌ చేరింది. మహిళల 57 కిలోల విభాగం సెమీస్‌లో జైస్మిన్‌ 5-0తో ఒమైలిన్‌ అల్కాలా (వెనెజులా)ను చిత్తుచేసి కనీసం రజతం ఖాయం చేసుకుంది. మరో అమ్మాయి మీనాక్షి హూడా సెమీస్‌ చేరడంతో భారత్‌ ఖాతాలో మరో పతకం ఖరారైంది. 48 కిలోల విభాగం క్వార్టర్‌పైనల్లో మీనాక్షి 5-0తో అలైస్‌ పుంప్రే (ఇంగ్లండ్‌)ను ఓడించింది. ఇక..పురుషుల విభాగంలో భారత్‌ పోరు ముగిసింది. బరిలో మిగిలిన జాదుమని సింగ్‌ 50 కిలోల కేటగిరీ క్వార్టర్‌ఫైనల్లో సాంఝర్‌ (కజకిస్థాన్‌) చేతిలో 0-4తో పరాజయం పాలయ్యాడు.

ఇవి కూడా చదవండి

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్... నామినీగా మహ్మద్ సిరాజ్

ఎందుకంత కోపం.. నేను నిజం మాత్రమే చెప్పాను: లలిత్ మోదీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 13 , 2025 | 02:49 AM