New Zealand Cricket Team: లెనాక్స్‌కు పిలుపు
ABN , Publish Date - Dec 24 , 2025 | 06:05 AM
వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించే న్యూజిలాండ్ వన్డే, టీ20 టీమ్‌లను మంగళవారం ప్రకటించారు. ఎడమచేతి వాటం స్పిన్నర్ జేడెన్ లెనాక్స్ తొలిసారి జట్టులో చోటు...
వన్డేలకు విలియమ్సన్ దూరం
భారత్ టూర్‌కు న్యూజిలాండ్ జట్ల ప్రకటన
వెల్లింగ్టన్: వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించే న్యూజిలాండ్ వన్డే, టీ20 టీమ్‌లను మంగళవారం ప్రకటించారు. ఎడమచేతి వాటం స్పిన్నర్ జేడెన్ లెనాక్స్ తొలిసారి జట్టులో చోటు దక్కించుకొన్నాడు. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ మైకేల్ శాంట్నర్ విశ్రాంతినివ్వడంతో.. వన్డే జట్టుకు మైకేల్ బ్రేస్‌వెల్ నాయకత్వం వహించనున్నాడు. టీ20లకు మాత్రం శాంట్నర్ సారథ్యం వహించనున్నారు. భారత సంతతికి చెందిన స్పిన్నర్ ఆదిత్య అశోక్‌కు చోటు దక్కింది. జనవరి 11 నుంచి జరిగే టూర్‌లో కివీస్ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.
ఇవీ చదవండి:
టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లో దీప్తి శర్మ!
టీ20ల్లో నయా రికార్డు.. ఒకే ఓవర్‌లో 5 వికెట్లు