Share News

ISSF World Cup 2025: ఇషా గోల్డెన్‌ షూట్‌

ABN , Publish Date - Sep 14 , 2025 | 05:19 AM

తెలుగు షూటర్‌ ఇషా సింగ్‌ అంతర్జాతీయ వేదికపై అదరగొట్టింది. హైదరాబాద్‌కు చెందిన 20 ఏళ్ల ఇషా.. ఐఎ్‌సఎ్‌సఎఫ్‌ ప్రపంచ కప్‌లో పసిడి మోత మోగించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌...

ISSF World Cup 2025: ఇషా గోల్డెన్‌ షూట్‌

ప్రపంచ కప్‌లో స్వర్ణం కైవసం

నింగ్బో (చైనా): తెలుగు షూటర్‌ ఇషా సింగ్‌ అంతర్జాతీయ వేదికపై అదరగొట్టింది. హైదరాబాద్‌కు చెందిన 20 ఏళ్ల ఇషా.. ఐఎ్‌సఎ్‌సఎఫ్‌ ప్రపంచ కప్‌లో పసిడి మోత మోగించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత ఈవెంట్‌లో చాంపియన్‌గా నిలిచింది. శనివారం ఇక్కడ ఉత్కంఠభరిత ఫైనల్స్‌లో ఇషా.. 0.1 పాయింట్‌ తేడాతో స్థానిక ఫేవరెట్‌ షూటర్‌ యావో కియాన్‌గ్జున్‌ను ఓడించి స్వర్ణ పతకం పట్టేసింది. ఇషా మొత్తం 242.6 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకోగా.. కియాన్‌గ్జున్‌ 242.5 స్కోరుతో రజతంతో సరిపెట్టుకుంది. దక్షిణ కొరియాకు చెందిన ఒలింపిక్‌ చాంపియన్‌ వో యెజిన్‌ 220.7 స్కోరుతో కాంస్య పతకానికి పరిమితమైంది. ప్రపంచ కప్‌లో ఇషాకు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. ఇక పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో భారత షూటర్లు భవేశ్‌ షెఖావత్‌ 22వ, ప్రదీ్‌పసింగ్‌ షెఖావత్‌ 23వ, మన్‌దీప్‌ సింగ్‌ 39వ స్థానాల్లో నిలిచి నిరాశపరిచారు.

ఇవి కూడా చదవండి

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్... నామినీగా మహ్మద్ సిరాజ్

ఎందుకంత కోపం.. నేను నిజం మాత్రమే చెప్పాను: లలిత్ మోదీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 14 , 2025 | 05:19 AM