IPL Matches Continue In Bengaluru: బెంగళూరులోనే ఐపీఎల్ మ్యాచ్‌లు డీకే శివకుమార్
ABN , Publish Date - Dec 08 , 2025 | 03:18 AM
చిన్నస్వామి స్టేడియంలోనే ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయని, వేదిక మార్చే అవకాశం ఇవ్వబోమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఉద్ఘాటించారు...
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): చిన్నస్వామి స్టేడియంలోనే ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయని, వేదిక మార్చే అవకాశం ఇవ్వబోమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఉద్ఘాటించారు. ఆదివారం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెంగళూరు నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లను మరోచోటికి మార్చేందుకు అంగీకరించేది లేదన్నారు. కాగా, కర్ణాటక క్రికెట్ సంఘం అధ్యక్షునిగా టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్, కార్యదర్శిగా సంతోష్ మీనన్ ఎన్నికయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సిరీస్ మొత్తంలో గర్వపడింది అప్పుడే: కేఎల్ రాహుల్
రికార్డులకే ‘కింగ్’.. సచిన్ మరో రికార్డు బద్దలు!