IPL Final 2025: ఫైనల్ మ్యాచ్‌కూ వర్షం ముప్పు.. అప్పుడు విజేతను ఎలా నిర్ణయిస్తారు..
ABN , Publish Date - Jun 02 , 2025 | 07:46 PM
దాదాపు రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఐపీఎల్ చిట్ట చివరి అంకానికి చేరుకుంది. మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మెగా ఫైనల్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడబోతున్నాయి
దాదాపు రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఐపీఎల్ (IPL 2025) చిట్ట చివరి అంకానికి చేరుకుంది. మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మెగా ఫైనల్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడబోతున్నాయి (PBKS vs RCB). ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. కాబట్టి ఈ ఏడాది కొత్త ఛాంపియన్‌ను చూసే అవకాశం ఉంది. అయితే అహ్మదాబాద్‌లో జరగబోయే ఈ ఫైనల్ మ్యాచ్‌కు కూడా వర్షం (Rain) ముప్పు పొంచి ఉంది.
ఆదివారం అహ్మదాబాద్‌లోనే జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచింది. దీంతో మ్యాచ్‌ను రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభించారు. ఫైనల్ మ్యాచ్ జరగబోయే మంగళవారం కూడా అహ్మదాబాద్‌లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉంది. వర్షం కారణంగా మంగళవారం మ్యాచ్ సాధ్యం కాకపోతే బుధవారం (జూన్ 4న) ఆ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. ఆ రోజు కూడా మ్యాచ్ సాధ్యం కాకపోతే మాత్రం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు.
పాయింట్ల పట్టికలో ఆర్సీబీ కంటే పంజాబ్ ముందంజలో ఉంది. రన్‌రేట్ కొద్దిగా ఎక్కువగా ఉండడంతో పంజాబ్ అగ్రస్థానంలో ఉంది. రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ సాధ్యం కాకపోతే పంజాబ్‌నే విజేతగా ప్రకటిస్తారు. అయితే అంతకంటే ముందు ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా ఆడించేందుకు ప్రయత్నిస్తారు. అప్పుడు కూడా సాధ్యం కాకపోతేనే పాయింట్ల పట్టిక ప్రకారం విజేతను నిర్ణయిస్తారు.
ఇవీ చదవండి:
చాహల్ గర్ల్‌ఫ్రెండ్ సెలబ్రేషన్స్ వైరల్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి