IPL 2025 SRH vs KKR: ఆఖరి పోరాటం.. సన్‌రైజర్స్ హ్యాట్రిక్ సాధిస్తుందా
ABN , Publish Date - May 25 , 2025 | 05:29 PM
దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ తుది అంకానికి చేరుకుంటోంది. కొన్ని జట్లు ఈ సీజన్‌లో చివరి మ్యాచ్‌కు రెడీ అవుతున్నాయి. ఈ రోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఈ సీజన్‌లో తమ చివరి మ్యాచ్ ఆడబోతున్నాయి.
దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ (IPL 2025) తుది అంకానికి చేరుకుంటోంది. కొన్ని జట్లు ఈ సీజన్‌లో చివరి మ్యాచ్‌కు రెడీ అవుతున్నాయి. ఈ రోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ (SRH VS KKR) జట్లు ఈ సీజన్‌లో తమ చివరి మ్యాచ్ ఆడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు పాయింట్ల పట్టికలో కాస్త పైకి చేరుకునే అవకాశం ఉంది. అయితే ఈ రెండు జట్లు ఇప్పటికే ఐపీఎల్-2025 నుంచి నిష్క్రమించాయి.

గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడ్డాయి. అయితే గతేడాదికి భిన్నంగా ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాయి. ప్లే ఆఫ్స్ అవకాశాలను కోల్పోయాయి. ఇరు జట్లలోనూ బలమైన ఆటగాళ్లు ఉన్నారు. అయితే వారు ఫామ్‌లో లేకపోవడమే అసలు సమస్యగా మారింది. గతేడాది ప్రత్యర్థి బౌలర్లను వణికించిన హైదరాబాద్ బ్యాటర్లు ఈ ఏడాది చతికిలపడ్డారు. ఫామ్ కోల్పోయి తంటాలు పడ్డారు (Match Prediction).
ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు 29 సార్లు తలపడ్డాయి. వీటిల్లో కేకేఆర్ ఏకంగా 19 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. సన్‌రైజర్స్ కేవలం 9 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఒక మ్యాచ్ టై అయింది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌పై కేకేఆర్ 80 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. అయితే ప్లే ఆవకాశాలను కోల్పోయిన తర్వాత హైదరాబాద్ అనూహ్యంగా పుంజుకుంది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందింది. ఈ రోజు మ్యాచ్‌లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలని కృత నిశ్చయంతో ఉంది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి