IPL 2025 SRH vs KKR: సన్‌రైజర్స్ సూపర్ విక్టరీ.. కేకేఆర్‌కు లాస్ట్ పంచ్
ABN , Publish Date - May 25 , 2025 | 11:18 PM
ఢిల్లీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయం సాధించింది. చివరి మ్యాచ్‌లో విశ్వరూపం చూపించింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో రాణించి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. భారీ తేడాతో విజయం సాధించింది.
ఢిల్లీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయం సాధించింది. చివరి మ్యాచ్‌లో విశ్వరూపం చూపించింది. ఏకంగా 110 పరుగుల తేడాతో గెలుపొందింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో రాణించి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. ఈ రోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఈ సీజన్‌లో తమ చివరి మ్యాచ్ ఆడేశాయి (IPL 2025). ఇప్పటికే ఐపీఎల్ తాజా సీజన్ నుంచి ఈ రెండు జట్లు నిష్క్రమించాయి.

టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో కోల్‌కతా బౌలింగ్ మొదలుపెట్టింది. కోల్‌కతా బ్యాటర్లను ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ (32) బెంబేలెత్తించారు. అభిషేక్ అవుటైన తర్వాత వచ్చిన క్లాసెన్ మరింత విధ్వంసం సృష్టించాడు. ప్రతి ఓవర్లో ఫోర్‌లు, సిక్స్‌లు కొడుతూ అలరించాడు. బంతిని బౌండరీ అవతలకు పంపడమే లక్ష్యంగా ఆడాడు. 37 బంతుల్లోనే మెరుపు శతకం సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది మూడో వేగవంతమైన సెంచరీ. చివర్లో ఇషాన్ కిషన్ (29) కూడా చెలరేగాడు. దీంతో సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది.
279 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. సునీల్ నరైన్ (31) మాత్రమే టాపార్డర్ బ్యాటర్లలో చెప్పుకోదగ్గ స్కోరు సాధించాడు. చివర్లో మనీష్ పాండే (37), హర్షిత్ రాణా (34) విజయం అంతరాన్ని తగ్గించే ఇన్నింగ్స్‌లు ఆడగలిగారు. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ 18.4 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌట్ అయింది. సన్‌రైజర్స్ బౌలర్లలో హర్ష్ దుబే, ఎషాన్ మలింగ మూడేసి వికెట్లు తీశారు. జయ్‌దేవ్ ఉనద్కత్ రెండు వికెట్లు తీశాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి