Share News

6 వేదికల్లో ఐపీఎల్‌

ABN , Publish Date - May 13 , 2025 | 05:46 AM

ఐపీఎల్‌ను ఈనెల 17న పునఃప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. మిగిలిన మ్యాచ్‌లను ఆరు వేదికల్లో నిర్వహించనుంది. జూన్‌ మూడున ఫైనల్‌ జరుగుతుంది. భారత్‌పై పాకిస్థాన్‌ దాడుల నేపథ్యంలో బీసీసీఐ..లీగ్‌ను...

6 వేదికల్లో ఐపీఎల్‌

17న పునః ప్రారంభం జూన్‌ 3న ఫైనల్‌

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ను ఈనెల 17న పునఃప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. మిగిలిన మ్యాచ్‌లను ఆరు వేదికల్లో నిర్వహించనుంది. జూన్‌ మూడున ఫైనల్‌ జరుగుతుంది. భారత్‌పై పాకిస్థాన్‌ దాడుల నేపథ్యంలో బీసీసీఐ..లీగ్‌ను వారం పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే భారత్‌-పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఐపీఎల్‌ను తిరిగి ప్రారంభించాలని సోమవారం జరిగిన సమావేశంలో బోర్డు నిర్ణయించింది. ఈనెల 17న బెంగళూరులో కోల్‌కతా-రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు పోరు ద్వారా లీగ్‌ పునఃప్రారంభమవుతుంది. బెంగళూరు, జైపూర్‌, ఢిల్లీ, లఖ్‌నవూ, అహ్మదాబాద్‌, ముంబైలలో లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌ల వేదికలను తర్వాత వెల్లడిస్తామని బీసీసీఐ తెలిపింది. ఈనెల 8వ తేదీన అర్ధంతరంగా నిలిపివేసిన పంజాబ్‌-ఢిల్లీ మ్యాచ్‌ 24న జైపూర్‌ వేదికగా జరుగుతుంది. ఆరు వేదికల్లో మొత్తం 13 లీగ్‌ మ్యాచ్‌లు, నాలుగు ప్లే ఆఫ్‌లు కలిపి మొత్తం 17 మ్యాచ్‌లు జరుగుతాయి. కాగా ఈనెల 29నుంచి ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య వన్డే సిరీస్‌ జరుగనుంది. ఆ రెండు దేశాలకు చెందిన పలువురు ఆటగాళ్లు ఐపీఎల్‌ ఆడుతున్నారు. అలాగే ఐపీఎల్‌ ముగిసిన వారం తర్వాత...అంటే జూన్‌ 11 నుంచి లార్డ్స్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ జరగాల్సివుంది. ఆస్ర్టేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.


సవరించిన షెడ్యూల్‌

మే 17 : బెంగళూరుగీ కోల్‌కతా (బెంగళూరు) : రా.7.30

మే 18 : రాజస్థాన్‌ గీ పంజాబ్‌ (జైపూర్‌) : మ.3.30

మే 18 : ఢిల్లీ గీ గుజరాత్‌ (ఢిల్లీ) : రా.7.30

మే 19 : హైదరాబాద్‌ గీ లఖ్‌నవూ (లఖ్‌నవూ) : రా.7.30

మే 20 : చెన్నైగీ రాజస్థాన్‌ (ఢిల్లీ) : రా.7.30

మే 21 : ముంబై గీ ఢిల్లీ (ముంబై) : రా.7.30

మే 22: గుజరాత్‌ గీ లఖ్‌నవూ (అహ్మదాబాద్‌) : రా.7.30

మే 23 : బెంగళూరు గీ హైదరాబాద్‌ (బెంగళూరు) : రా.7.30

మే 24 : పంజాబ్‌ గీ ఢిల్లీ (జైపూర్‌) : రా.7.30

మే 25 : గుజరాత్‌ గీ చెన్నై (అహ్మదాబాద్‌) : మ.3.30

మే 25 : హైదరాబాద్‌ గీ కోల్‌కతా (ఢిల్లీ) : రా.7.30

మే 26 : పంజాబ్‌ గీ ముంబై (జైపూర్‌) : రా.7.30

మే 27 : లఖ్‌నవూ గీ బెంగళూరు (లఖ్‌నవూ) : రా.7.30

మే 29 : క్వాలిఫయర్‌ 1 : రా.7.30

మే 30 : ఎలిమినేటర్‌ : రా.7.30

జూన్‌ 1: క్వాలిఫయర్‌ 2 : రా.7.30

జూన్‌ 3 - ఫైనల్‌ రా.7.30 గం.

ఇవి కూడా చదవండి..

AP SSC Supplimentary Exams hall tickets: టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..

Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల

Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ

For Sports News And Telugu News

Updated Date - May 13 , 2025 | 05:46 AM