Virat Kohli: విరాట్ కోహ్లీ సిక్స్‌లు చూశారా.. ఏకంగా ఐదు సిక్స్‌లతో రెచ్చిపోయిన కింగ్
ABN , Publish Date - May 03 , 2025 | 08:53 PM
కింగ్ కోహ్లీ మరోసారి తన క్లాస్ చూపించాడు. ఈ సీజన్‌లో ఏడో అర్ధశతకాన్ని నమోదు చేశాడు. వరుసగా మూడో హాఫ్ సెంచరీ కొట్టాడు. సాధారణంగా కోహ్లీ కాస్త నెమ్మదిగా ఆడతాడనే విమర్శ ఉంది. తన ఇన్నింగ్స్‌లో సిక్స్‌లు అరుదుగా ఉంటాయి.
కింగ్ కోహ్లీ (Virat Kohli) మరోసారి తన క్లాస్ చూపించాడు. ఈ సీజన్‌లో ఏడో అర్ధశతకాన్ని నమోదు చేశాడు. వరుసగా మూడో హాఫ్ సెంచరీ కొట్టాడు. సాధారణంగా కోహ్లీ కాస్త నెమ్మదిగా ఆడతాడనే విమర్శ ఉంది. తన ఇన్నింగ్స్‌లో సిక్స్‌లు (Kohli Sixes) అరుదుగా ఉంటాయి. అయితే తాజా మ్యాచ్‌లో మాత్రం కోహ్లీ రెచ్చిపోయాడు. చిన్నస్వామి స్టేడియంలో సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు (Virat Kohli Half Century).
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడుతన్నాయి. ఆ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ధోనీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లీ సంచలన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 33 బంతుల్లో 62 పరుగులు చేసి అవుటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 187కు పైగా ఉంది. మైదానం నలువైపులా సిక్స్‌లు కొట్టి బెంగళూరు అభిమానులను అలరించారు. బెంగళూరు భారీ స్కోరుకు బాటలు వేశాడు.
ఇవి కూడా చదవండి..
ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు
హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..