Share News

IPL 2025 RCB vs CSK: టాస్ గెలిచిన చెన్నై.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే

ABN , Publish Date - May 03 , 2025 | 07:02 PM

క్రికెట్ అభిమానులకు శుభవార్త. వర్షం పడి మ్యాచ్ రద్దవుతుందనే సూచనలతో నిరాశపడుతున్న అభిమానులకు గుడ్ న్యూస్. దిగ్గజ ఆటగాళ్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ కలిసి ఆడుతున్న చివరి మ్యాచ్ అని వార్తలు వినబడుతున్న నేపథ్యంలో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది.

IPL 2025 RCB vs CSK: టాస్ గెలిచిన చెన్నై.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే
RCB vs CSK

క్రికెట్ అభిమానులకు శుభవార్త. వర్షం పడి మ్యాచ్ రద్దవుతుందనే సూచనలతో నిరాశపడుతున్న అభిమానులకు గుడ్ న్యూస్. దిగ్గజ ఆటగాళ్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ కలిసి ఆడుతున్న చివరి మ్యాచ్ అని వార్తలు వినబడుతున్న నేపథ్యంలో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈ రోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB vs CSK) జట్లు తలపడుతున్నాయి.


టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆర్సబీ టీమ్ బ్యాటింగ్‌కు సిద్ధమవుతోంది. వర్షం ఈ మ్యాచ్‌కు అడ్డంకిగా మారుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత మూడ్రోజులుగా బెంగళూరు వర్షంతో తడిసి ముద్దవుతోంది. ప్రస్తుతానికి వర్షం శాంతించింది. అయితే మ్యాచ్ మధ్యలో వర్షం పడే అవకాశాన్ని మాత్రం కొట్టిపారెయ్యలేము. ఒకవేళ మ్యాచ్ జరిగి ఆర్సీబీ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి చేరడమే కాకుండా ప్లే ఆఫ్స్ కోసం బెర్త్‌ను కూడా ఖరారు చేసుకుంటుంది.


ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు ఎంత మంది ఉన్నా ధోనీ, కోహ్లీ పైనే అందరి కళ్లూ ఉంటాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ సీజన్ తర్వాత ధోనీ ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతాడని వార్తలు వస్తున్నాయి. అదే కనుక జరిగితే ధోనీ, కోహ్లీ కలిసి ఆడే చివరి మ్యాచ్ ఇదే అవుతుంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు

ట్రాన్స్‌జెండర్లకు చోటు లేదు

హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 03 , 2025 | 07:03 PM