Share News

IPL 2025 RCB vs CSK: షెపర్డ్ విధ్వంసకర ఇనింగ్స్‌.. చెన్నై టార్గెట్ ఎంతంటే

ABN , Publish Date - May 03 , 2025 | 09:17 PM

ఆరంభ ఓవర్లలోనూ, చివరి ఓవర్లలోనూ బ్యాటర్లు రాణించడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (61), జాకబ్ బెతల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో షెపర్డ్ (14 బంతుల్లో 53) బౌండరీల వర్షం కురిపించాడు.

IPL 2025 RCB vs CSK: షెపర్డ్ విధ్వంసకర ఇనింగ్స్‌.. చెన్నై టార్గెట్ ఎంతంటే
Virat Kohli

ఆరంభ ఓవర్లలోనూ, చివరి ఓవర్లలోనూ బ్యాటర్లు రాణించడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (61), జాకబ్ బెతల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో షెపర్డ్ (14 బంతుల్లో 53) బౌండరీల వర్షం కురిపించాడు. ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేశాడు. చెన్నై బౌలర్ పతిరణ మూడు వికెట్లు తీయడమే కాకుండా పరుగులు రాకుండా కట్టడి చేశాడు. దీంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్సోయి 213 పరుగులు చేసింది.

kohli2.jpg


బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడుతన్నాయి. ఆ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ధోనీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లీ సంచలన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 33 బంతుల్లో 62 పరుగులు చేసి అవుటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. మరో ఓపెనర్ జాకబ్ బెతల్ కూడా చక్కగా ఆడి హాఫ్ సెంచరీ చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 97 పరుగుల జోడించారు. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో బెంగళూరు ఇన్నింగ్స్ గతి తప్పింది.


చివర్లో వచ్చిన షెపర్డ్ (53 నాటౌట్) మాత్రం విధ్వంసం సృష్టించాడు. 14 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో మహేష్ పతిరణ మూడు వికెట్లు తీశాడు. నూర్ అహ్మద్, సామ్ కరన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. మరి, ఆర్సీబీ నిర్దేశించిన 214 పరుగుల లక్ష్యాన్ని చెన్నై ఎలా ఛేదిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి..

ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు

ట్రాన్స్‌జెండర్లకు చోటు లేదు

హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 03 , 2025 | 09:19 PM