Share News

RCB Victory Parade: ఎరుపెక్కనున్న బెంగళూరు.. ఓపెన్ బస్ రైడ్‌కు గ్రీన్ సిగ్నల్..

ABN , Publish Date - Jun 04 , 2025 | 04:50 PM

18 ఏళ్ల ఎదురుచూపులకు ఫలితం దక్కింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల సంతోషం అవధులు దాటింది. తమ అభిమాన క్రికెటర్లు సాధించిన ఘనతను చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అహ్మదాబాద్ నుంచి బెంగళూరు వచ్చిన క్రికెటర్లకు ఘనస్వాగతం పలికారు.

RCB Victory Parade: ఎరుపెక్కనున్న బెంగళూరు.. ఓపెన్ బస్ రైడ్‌కు గ్రీన్ సిగ్నల్..
RCB Victory Parade

18 ఏళ్ల ఎదురుచూపులకు ఫలితం దక్కింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానుల సంతోషం అవధులు దాటింది. తమ అభిమాన క్రికెటర్లు సాధించిన ఘనతను చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అహ్మదాబాద్ నుంచి బెంగళూరు వచ్చిన క్రికెటర్లకు ఘనస్వాగతం పలికారు. అభిమానులను (RCB Fans) మురిపించేందుకు ఓపెన్ బస్ రైడ్ నిర్వహించాలని ఆర్సీబీ యాజమాన్యం భావించింది. అయితే ట్రాఫిక్ కారణాల దృష్ట్యా ఓపెన్ బస్ పరేడ్‌కు పోలీసుల నుంచి అనుమతి రాలేదని వార్తలు వచ్చాయి (IPL 2025).


తాజా సమాచారం ప్రకారం విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఆర్సీబీ ఆటగాళ్ల ఓపెన్ బస్ పరేడ్ జరగబోతున్నట్టు తెలుస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రిని కూడా ఆర్సీబీ ఆటగాళ్లు కలవబోతున్నట్టు సమాచారం. అలాగే పలువురు మంత్రులను కూడా కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు కలుస్తారట. సీఎంను కలిసిన తర్వాత ఓపెన్ బస్ పరేడ్ ఉంటుందని ఆర్సీబీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అయితే ఈ విషయంలో ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. అభిమానులు మాత్రం బెంగళూరు రోడ్లుపైకి ఇప్పటికే భారీగా చేరుకున్నారు.


ఒకవేళ ఓపెన్ బస్ పరేడ్‌కు అనుమతి లభిస్తే ఆ కార్యక్రమం అనంతరం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆటగాళ్లను సన్మానిస్తారు. ఓపెన్ బస్ పరేడ్‌కు అనుమతి లేకపోతే నేరుగా చిన్నస్వామి స్టేడియంలో సంబరాలను ప్రారంభిస్తారు. ఎంట్రీ పాస్‌లు ఉన్నవారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తారట. పార్కింగ్ విషయంలో కూడా ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. కాగా, ప్రస్తుతం చిన్నస్వామి స్టేడియం సమీపంలో తొక్కిసలాట జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.


ఇవి కూడా చదవండి..

Virat Kohli: నిన్ను ముద్దాడడం కోసం 18 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నా: విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్

IPL 2025: ఐపీఎల్ ప్రైజ్‌మనీ.. ఏ జట్టుకు ఎంతెంత దక్కుతుందంటే


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 04 , 2025 | 05:01 PM