Share News

IPL 2025: ఐపీఎల్ ప్రైజ్‌మనీ.. ఏ జట్టుకు ఎంతెంత దక్కుతుందంటే

ABN , Publish Date - Jun 04 , 2025 | 03:29 PM

దాదాపు రెండున్నరేళ్లు క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించిన ఐపీఎల్ 2025 మంగళవారంతో ముగిసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది.

IPL 2025: ఐపీఎల్ ప్రైజ్‌మనీ.. ఏ జట్టుకు ఎంతెంత దక్కుతుందంటే
IPL Prize Money

దాదాపు రెండున్నరేళ్లు క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించిన ఐపీఎల్ 2025 (IPL 2025) మంగళవారంతో ముగిసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది (RCB vs PBKS). 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ విజేతగా నిలిచింది. దీంతో ఆర్సీబీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ భారీ ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది (IPL prize money).


విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఏకంగా రూ.20 కోట్ల రూపాయల ప్రైజ్‌మనీ అందుకుంది. ఇక, రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్ 12.5 కోట్లు రూపాయల బహుమానం అందుకుంది. ఇక, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్ టీమ్ రూ.7 కోట్లు దక్కించుకుంది. ఇక, నాలుగో స్థానంలో నిలిచిన గుజరాత్ టైటాన్స్ టీమ్ 6.5 కోట్ల రూపాయలు సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

Virat Kohli: నిన్ను ముద్దాడడం కోసం 18 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నా: విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్

IPL Final 2025: నెరవేరిన 18 ఏళ్ల కల.. ఈ సారి కప్పు ఆర్సీబీదే.. పంజాబ్‌పై గెలుపు


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 04 , 2025 | 04:44 PM