Share News

Mumbai Indians: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ రికార్డు.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఓడిపోని జట్టు ఇదే

ABN , Publish Date - May 03 , 2025 | 07:34 PM

ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్ మొదటి ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒకదాంట్లో మాత్రమే గెలిచింది. అయితే ఆ తర్వాత ముంబై అద్భుతమైన పునరాగమనం చేసింది. వరుసగా 6 మ్యాచ్‌లను గెలిచి ప్లే-ఆఫ్స్ రేసులో అగ్రస్థానంలో ఉంది.

Mumbai Indians: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ రికార్డు.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఓడిపోని జట్టు ఇదే
Mumbai Indians

తాజా ఐపీఎల్ (IPL 2025) సీజన్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు అద్భుతంగా పుంజుకుంది. ఈ సీజన్ మొదటి ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒకదాంట్లో మాత్రమే గెలిచింది. అయితే ఆ తర్వాత ముంబై అద్భుతమైన పునరాగమనం చేసింది. వరుసగా 6 మ్యాచ్‌లను గెలిచి ప్లే-ఆఫ్స్ రేసులో అగ్రస్థానంలో ఉంది. అలాగే ఐపీఎల్‌లో 150కి పైగా విజయాలు సాధించిన జట్టుగా కూడా నిలిచింది. ఆ ఘనత సాధించిన ఏకైక జట్టు ముంబై ఇండియన్స్ టీమ్ మాత్రమే (MI Record).

mi3.jpg


రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వంద పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 217 పరుగులు చేసింది. ఆ తర్వాత ముంబై బౌలింగ్ ఎటాక్‌ను తట్టుకుని నిలబడలేక రాజస్తాన్ చతికిలపడింది. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ 17 సార్లు 200కు పైగా పరుగులు చేసింది. విశేషం ఏమిటంటే ఆ మ్యాచ్‌లన్నింటిలోనూ ముంబై గెలిచింది. 200కి పైగా పరుగులు చేసిన తర్వాత ఒక్క మ్యాచ్‌‌లో కూడా ఓటమి ఎరుగని జట్టు ముంబై మాత్రమే.

mi.jpg


ఈ రికార్డు ముంబై బౌలింగ్ ఎటాక్ బలాన్ని తెలియచేస్తుంది. జస్ప్రీత్ బుమ్రా చాలా కాలంగా ముంబై బౌలింగ్ ఎటాక్‌కు వెన్నెముకగా ఉన్నాడు. తాజా సీజన్‌లో ట్రెంట్ బౌల్ట్ వంటి క్వాలిటీ బౌలర్ కూడా కలిశాడు. ఇక, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా వంటి బౌలర్లు కూడా చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. దీంతో ముంబై బౌలింగ్ ఎటాక్‌ను ఎదుర్కొని పరుగులు చేయడంలో ప్రత్యర్థులు తడబడుతున్నారు.

ఇవి కూడా చదవండి..

ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు

ట్రాన్స్‌జెండర్లకు చోటు లేదు

హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 03 , 2025 | 07:34 PM