Share News

IPL 2025 MI vs PBKS: టాప్ ప్లేస్‌కు పంజాబ్.. ముంబైపై ఘన విజయం

ABN , Publish Date - May 26 , 2025 | 11:17 PM

ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్-2 బెర్త్‌ను కన్ఫామ్ చేసుకునేందుకు జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ మెరిసింది. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ మెరుగ్గా రాణించి ముంబైపై సాధికారిక విజయం సాధించింది. ఏకంగా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

IPL 2025 MI vs PBKS: టాప్ ప్లేస్‌కు పంజాబ్.. ముంబైపై ఘన విజయం
PBKS Won by 8 wickets against MI

ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్-2 బెర్త్‌ను కన్ఫామ్ చేసుకునేందుకు జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ మెరిసింది. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ మెరుగ్గా రాణించి ముంబైపై సాధికారిక విజయం సాధించింది. ఏకంగా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానానికి చేరుకుంది (MI vs PBKS). జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి (IPL 2025).

priyansh.jpg


టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. స్లోగా ఉన్న పిచ్‌పై పరుగులు చేసేందుకు ముంబై బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (24), రికెల్టన్ (21) తొలి వికెట్‌కు 45 పరుగులు జోడించారు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే వికెట్లు పడిపోవడంతో ముంబై పరుగుల వేగం తగ్గింది. అయితే మరోసారి సూర్యకుమార్ యాదవ్ మరోసారి అర్ధశతకం సాధించాడు. ఈ సీజన్‌లో ఐదో హాఫ్ సెంచరీ చేశాడు. ముంబై భారీ స్కోరులో కీలక పాత్ర పోషించాడు.


చివర్లో నమన్ ధీర్ (20) వేగంగా పరుగులు చేశాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో యన్‌సెన్, వైశాఖ్ విజయ్ కుమార్ రెండేసి వికెట్లు పడగొట్టారు. హర్‌ప్రీత్ బ్రార్ ఒక్క వికెట్ తీశాడు. చివరి ఓవర్ బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్ కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.


185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు మంచి ఆరంభమే లభించింది. ప్రభ్‌సిమ్రన్ (13) త్వరగానే ఔటైనా మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (62), జాస్ ఇంగ్లీస్ (73) జట్టును గెలిపించే ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు. రెండో వికెట్‌కు 109 పరుగులు జోడించి విజయాన్ని ఖరారు చేశారు. చివర్లో శ్రేయస్ అయ్యర్ (26 నాటౌట్) విజయానికి కావాల్సిన పరుగులు చేశాడు. ఈ విజయంతో పంజాబ్ టాప్-2 బెర్త్‌ను కన్ఫామ్ చేసుకుంది.


ఇవీ చదవండి:

డుప్లెసిస్ మామూలోడు కాదు!

జీటీ ఇక సర్దుకోవాల్సిందే!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 26 , 2025 | 11:19 PM