Share News

IPL 2025 MI vs PBKS: రాణించిన ముంబై బ్యాటర్లు.. పంజాబ్ ముందు భారీ టార్గెట్

ABN , Publish Date - Jun 01 , 2025 | 11:40 PM

ఐపీఎల్‌ ఫైనల్ బెర్త్ కోసం జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు మెరిశారు. అందరూ సమష్టిగా రాణించి స్కోరు బోర్డు‌పై భారీ స్కోరును ఉంచారు. ఈ రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.

IPL 2025 MI vs PBKS: రాణించిన ముంబై బ్యాటర్లు.. పంజాబ్ ముందు భారీ టార్గెట్
Surya kumar Yadav

ఐపీఎల్‌ (IPL 2025) ఫైనల్ బెర్త్ కోసం జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు మెరిశారు. అందరూ సమష్టిగా రాణించి స్కోరు బోర్డు‌పై భారీ స్కోరును ఉంచారు. ఈ రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (PBKS), ముంబై ఇండియన్స్ (MI) మధ్య మ్యాచ్ జరుగుతోంది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది (MI vs PBKS).


టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముంబై బ్యాటింగ్‌కు దిగింది. రోహిత్ శర్మ (8) త్వరగానే ఔటైనా మరో ఓపెనర్ జానీ బెయిర్ స్టో (38) మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ (44), తిలక్ వర్మ (44) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి ముంబై భారీ స్కోరుకు బాటలు వేశారు. చివర్లో నమన్ ధీర్ (37) వేగంగా ఆడి కీలకమైన పరుగులు చేశాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది.


పంజాబ్ బౌలర్లలో కైలీ జేమీసన్, మార్కస్ స్టోయినిస్, ఒమర్జాయ్, వైశాఖీ విజయ్ కుమార్, ఛాహల్ ఒక్కో వికెట్ తీశారు. అయితే బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మరి, ఆర్సీబీతో జరిగిన గత మ్యాచ్‌లో ఘోరంగా విఫలమై దారుణ ఓటమి చవిచూసిన పంజాబ్ ఈ మ్యాచ్‌లో భారీ స్కోరును ఎలా ఛేజ్ చేస్తారో చూడాలి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది.


ఇవీ చదవండి:

ఫైనల్‌కు వెళ్లేది ఆ జట్టేనా?

వాన గండం.. ఫైనల్ వెళ్లేదెవరు?

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 01 , 2025 | 11:40 PM