Share News

IPL 2025 MI vs DC: ప్లే ఆఫ్స్‌కు ముంబై.. ఢిల్లీ ఇంటికే

ABN , Publish Date - May 21 , 2025 | 11:18 PM

ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చెలరేగారు (IPL 2025). అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ ఆధిపత్యం ప్రదర్శించి ఢిల్లీ క్యాపిటల్స్‌పై సాధికారిక విజయం సాధించింది.

IPL 2025 MI vs DC: ప్లే ఆఫ్స్‌కు ముంబై.. ఢిల్లీ ఇంటికే
MI won by 59 runs against DC

ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చెలరేగారు (IPL 2025). అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ ఆధిపత్యం ప్రదర్శించి ఢిల్లీ క్యాపిటల్స్‌పై సాధికారిక విజయం సాధించింది. బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ (73), బౌలింగ్‌లో మిచెల్ శాంట్నర్ (3/11), బుమ్రా (3/12) ఆకట్టుకోవడంతో ఢిల్లీపై ముంబై ఏకంగా 59 పరుగుల తేడాతో గెలిచింది. ఈ పరాజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతైనట్టే. (MI vs DC).

surya.jpg


టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డుప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు ఆరంభంలో షాక్ తగిలింది. మూడో ఓవర్లోనే రోహిత్ శర్మ (5) అవుటయ్యాడు. ర్యాన్ రికెల్టన్ (25), విల్ జాక్స్ (21) వేగంగా పరుగులు చేయలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మాత్రం సమయోచితంగా ఆడుతూ అర్ధశతకం సాధించాడు. తిలక్ వర్మ (27) కూడా కీలక పరుగులు చేశాడు. చివర్లో నమన్ ధీర్ (24) వేగంగా పరుగులు చేశాడు. 19 ఓవర్లో ఏకంగా 24 పరుగులు రాబట్టాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు వికెట్లు తీశాడు. ఛమీరా, ముస్తాఫిజుర్ రెహ్మాన్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు.


ముంబై నిర్దేశించిన 181 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు డుప్లిసిస్ (6), కేఎల్ రాహుల్ (11), అభిషేక్ పోరెల్ (6) త్వరగానే అవుటయ్యారు. 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీని సమీర్ రజ్వీ (39) ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే ముంబై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఢిల్లీ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. చివరకు ఢిల్లీ 18.2 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌటైంది. ముంబై బౌలర్లలో మిచెల్ శాంట్నర్, బుమ్రా మూడేసి వికెట్లు సాధించారు.

ఇవీ చదవండి:

కటౌట్ ఎత్తుకెళ్లిన కమిన్స్

సాకులు చెబుతున్న ధోని

బీసీసీఐపై ఫ్రాంచైజీలు సీరియస్!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 21 , 2025 | 11:20 PM