Share News

IPL 2025 MI vs DC: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే

ABN , Publish Date - May 21 , 2025 | 07:10 PM

తాజా ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌లో మిగిలిన ఒక బెర్త్‌ను డిసైడ్ చేసే కీలక మ్యాచ్‌కు తెర లేచింది. ఈ సీజన్‌లో అత్యంత కీలక మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈ రోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది.

IPL 2025 MI vs DC: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే
DC vs MI

తాజా ఐపీఎల్‌ (IPL 2025) ప్లే ఆఫ్స్‌లో మిగిలిన ఒక బెర్త్‌ను డిసైడ్ చేసే కీలక మ్యాచ్‌కు తెర లేచింది. ఈ సీజన్‌లో అత్యంత కీలక మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈ రోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), ముంబై ఇండియన్స్ (MI) మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. అయితే మ్యాచ్ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి (MI vs DC).


టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డుప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముంబై బ్యాటింగ్‌కు రెడీ అవుతోంది. అక్షర్ పటేల్ ఫ్లూ జ్వరం కారణంగా దూరమవడంతో డుప్లెసిస్ ఢిల్లీ టీమ్‌కు కెప్టెన్సీ వహించబోతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ చేసే ఆల్‌రౌండర్ అయిన అక్షర్ పటేల్ ఈ మ్యాచ్‌కు దూరం కావడం ఢిల్లీకి పెద్ద లోటు అని చెప్పక తప్పదు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు వెళ్తుంది. వర్షం పడకపోతే ముంబైలో మంచి ఆసక్తికర మ్యాచ్ జరిగే అవకాశం కనబడుతోంది.


తుది జట్లు:

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, నమన్ ధీర్, దీపక్ ఛాహర్, బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, మిచెల్ శాంట్నర్

ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, డుప్లెసిస్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అషుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, నటరాజన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మాదవ్ తివారీ

ఇవీ చదవండి:

14 ఏళ్లకే ఇంత క్రేజా!

సాకులు చెబుతున్న ధోని

బీసీసీఐపై ఫ్రాంచైజీలు సీరియస్!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 21 , 2025 | 07:10 PM