Share News

IPL 2025 KKR vs RCB: ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే.. వారు లేకపోవడం మాత్రం లోటే..

ABN , Publish Date - May 17 , 2025 | 05:32 PM

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడబోతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలని ఆర్సీబీ ఊవిళ్లూరుతోంది.

IPL 2025 KKR vs RCB: ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే.. వారు లేకపోవడం మాత్రం లోటే..
KKR vs RCB

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ ఈ రోజు (మే 17) తిరిగి ప్రారంభం కాబోతోంది (IPL 2025). బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడబోతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలని ఆర్సీబీ ఊవిళ్లూరుతోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని కేకేఆర్ కృతనిశ్చయంతో ఉంది (KKR vs RCB).

kohli.jpg


ఇరు జట్లూ కీలక ఆటగాళ్ల దూరం కావడంతో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. బెంగళూరు కీలక బౌలర్ అయిన జాష్ హాజెల్‌వుడ్ భుజం గాయంతో సతమతమవుతున్నాడు. దీంతో అతడు ఇక ఆర్సీబీ తరఫున ఈ సీజన్‌లో బరిలోకి దిగే అవకాశాలు కనిపించడం లేదు. ఇక, కేకేఆర్‌కు చెందిన మొయిన్ అలీ, రోవ్‌మెన్ పావెల్ కూడా మిగిలిన టోర్నీ ఆడడం లేదు. ఇక, ఎప్పటిలాగానే విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆర్సీబీకి కీలక ప్లేయర్. ఫిల్ సాల్ట్, రజత్ పటిదార్, కృనాల్ పాండ్యా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. బౌలింగ్‌లో లుంగీ ఎంగిడీ, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, సుయాష్ శర్మ చక్కగా రాణిస్తున్నారు.


మరోవైపు కేకేఆర్ స్థిరత్వ లేమితో సతమతమవుతోంది. అజింక్య రహానే తప్ప మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించడం లేదు. సునీల్ నరైన్, రఘవంశీ కాస్త ఫర్వాలేదనిపిస్తున్నారు. బౌలింగ్‌‌లో మాత్రం కోల్‌కతా బలంగా కనిపిస్తోంది. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, నోర్ట్జే ప్రత్యర్థులను కట్టడి చేయగలుగుతున్నారు.


తుది జట్లు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (అంచనా): ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మాయంక్ అగర్వాల్, రజత్ పటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రోమియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, లుంగీ ఎంగిడీ, యశ్ దయాల్,

కోల్‌కతా నైట్ రైడర్స్ (అంచనా): రహ్మానుల్ గుర్భాజ్, సునీల్ నరైన్, అజింక్య రహానే, రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, ఆండ్రూ రస్సెల్, రింకూ సింగ్, రమణ్‌దీప్ సింగ్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, నోర్ట్జే

ఇవీ చదవండి:

ఐపీఎల్ రీస్టార్ట్‌కు వాన ముప్పు

నీరజ్ చోప్రాపై మోదీ ప్రశంసలు

కోహ్లీ టెన్త్ మార్క్ షీట్ వైరల్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 17 , 2025 | 05:32 PM