Share News

IPL 2025 KKR vs RCB: బెంగళూరులో భారీ వర్షం.. ఆలస్యం కానున్న టాస్..

ABN , Publish Date - May 17 , 2025 | 07:34 PM

ఐపీఎల్ రీ ఎంట్రీ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. బెంగళూరులో భారీ వర్షం కురుస్తోంది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ ఈ రోజు (మే 17) తిరిగి ప్రారంభం కాబోతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి.

IPL 2025 KKR vs RCB: బెంగళూరులో భారీ వర్షం.. ఆలస్యం కానున్న టాస్..
RCB vs KKR match delayed due to rain

ఐపీఎల్ రీ ఎంట్రీ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. బెంగళూరులో భారీ వర్షం కురుస్తోంది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ ఈ రోజు (మే 17) తిరిగి ప్రారంభం కాబోతోంది (IPL 2025). బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలని ఆర్సీబీ ఊవిళ్లూరుతోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని కేకేఆర్ కృతనిశ్చయంతో ఉంది (KKR vs RCB).


ఇరు జట్ల ఆశలకు వర్షం (Rain) అడ్డంకిగా మారింది. వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగానే బెంగళూరులో భారీ వర్షం కురుస్తోంది. దీంతో చిన్నస్వామి స్టేడియంలోని పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. వర్షం తగ్గిన తర్వాతే టాస్ వేస్తారు. వర్షం తగ్గకపోతే మ్యాచ్ రద్దయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే అప్పుడు ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. దీంతో కేకేఆర్ ఈ టోర్నీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటుంది. ఆర్సీబీ మళ్లీ టేబుల్ టాప్ స్పాట్‌కు చేరుకుంటుంది. అయితే ప్లే ఆఫ్స్ బెర్త్‌ను కన్ఫామ్ చేసుకోవాలంటే మాత్రం ఆర్సీబీ మరో విజయం సాధించాల్సిందే


ఇవి కూడా చదవండి..

Rahul Dravid: ఇక, టిక్కెట్ల గురించి భయం లేదు.. రోహిత్‌కు రాహుల్ ద్రవిడ్ ఫన్నీ మెసేజ్


Rohit Sharma: రోహిత్ శర్మకు కోపమొచ్చింది.. తమ్ముడిని ఎలా తిట్టాడో చూడండి..


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 17 , 2025 | 07:34 PM