Share News

IPL 2025 KKR vs RCB: మ్యాచ్ వర్షార్పణం.. ఇరు జట్లకు చెరో పాయింట్

ABN , Publish Date - May 17 , 2025 | 10:40 PM

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ ఈ రోజు (మే 17) తిరిగి ప్రారంభమైంది. అయితే ఈ రోజు వర్షం అడ్డంకిగా మారింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.

IPL 2025 KKR vs RCB: మ్యాచ్ వర్షార్పణం.. ఇరు జట్లకు చెరో పాయింట్
IPL Match cancelled due to rain

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ ఈ రోజు (మే 17) తిరిగి ప్రారంభమైంది. అయితే ఈ రోజు వర్షం అడ్డంకిగా మారింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఎంతకీ ఆగకుండా ఏకధాటిగా వర్షం పడడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఈ మ్యాచ్‌లో గెలిచి నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలని ఆర్సీబీ భావించింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని కేకేఆర్ అనుకుంది (KKR vs RCB).


వర్షం కారణంగా మ్యాచ్ రద్దుకావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. దీంతో కేకేఆర్ ఈ టోర్నీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. మిగిలిన మరో మ్యాచ్‌లో గెలిచినా కేకేఆర్‌కు ప్లే ఆఫ్స్‌కు ఛాన్స్ దక్కదు. దీంతో ఇప్పటికే ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ సరసన కేకేఆర్ కూడా నిలిచింది. ఈ నాలుగు జట్లు ఇప్పటికి అధికారికంగా ఐపీఎల్ 2025 నుంచి నిష్క్రమించాయి. ఇక, టాప్-4 స్థానాల కోసం మిగిలిన ఆరు జట్లు పోటీపడతాయి.


మ్యాచ్ రద్దు కావడంతో ఒక పాయింట్ సంపాదించిన ఆర్సీబీ మళ్లీ టేబుల్ టాప్ స్పాట్‌కు చేరుకుందిది. అయితే ప్లే ఆఫ్స్ బెర్త్‌ను కన్ఫామ్ చేసుకోవాలంటే మాత్రం మరో విజయం సాధించాల్సిందే (KKR vs RCB Match Prediction). ఇప్పటికి 12 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలు సాధించి 17 పాయింట్లతో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. తర్వాతి మ్యాచ్‌లో గెలిస్తే ఆర్సీబీ నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.

ఇవి కూడా చదవండి..

Rahul Dravid: ఇక, టిక్కెట్ల గురించి భయం లేదు.. రోహిత్‌కు రాహుల్ ద్రవిడ్ ఫన్నీ మెసేజ్


Rohit Sharma: రోహిత్ శర్మకు కోపమొచ్చింది.. తమ్ముడిని ఎలా తిట్టాడో చూడండి..


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 17 , 2025 | 10:40 PM