IPL 2025 CSK vs RR: రాణించిన వైభవ్, సంజూ.. చెన్నైపై రాజస్థాన్ గెలుపు
ABN , Publish Date - May 20 , 2025 | 10:58 PM
వైభవ్ సూర్యవంశీ అర్ధసెంచరీతో రాణించడంతో పాటు కెప్టెన్ సంజూ శాంసన్ కీలక ఇన్నింగ్స్ ఆడడంతో రాజస్థాన్ రాయల్స్ ఓ గెలుపు అందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌పై సాధికారిక విజయం సాధించింది. చెన్నైపై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.
వైభవ్ సూర్యవంశీ అర్ధసెంచరీతో రాణించడంతో పాటు కెప్టెన్ సంజూ శాంసన్ కీలక ఇన్నింగ్స్ ఆడడంతో రాజస్థాన్ రాయల్స్ ఓ గెలుపు అందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌పై సాధికారిక విజయం సాధించింది. చెన్నైపై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రోజు రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి (RR vs CSK).
టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో చెన్నై టీమ్ బ్యాటింగ్‌కు దిగింది. 12 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన చెన్నైను ఓపెనర్ ఆయుష్ మాత్రే (43) ఆదుకున్నాడు. మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మిడిలార్డర్‌లో బ్రేవిస్ (42), శివమ్ దూబే (39) కీలక పరుగులు చేశారు. చివర్లో రాజస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ధోనీ (16) పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో యుద్వీర్ సింగ్, ఆకాశ్ మద్వాల్ మూడేసి వికెట్లు తీశారు.
చెన్నై నిర్దేశించిన 188 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్లు అద్భుత ఆరంభాన్ని అందించారు. యశస్వి జైస్వాల్ (36) మెరుపు వేగంతో పరుగులు చేశాడు. యశస్వి ఔటైన తర్వాత వైభవ్ సూర్యవంశీ (57), కెప్టెన్ సంజూ శాంసన్ (41) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 98 పరుగులు జోడించి విజయానికి బాటలు వేశారు. చివర్లో ధ్రువ్ జురెల్ (31 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశాడు. దీంతో రాజస్థాన్ 17.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది.
ఇవి కూడా చదవండి..
IPL 2025 CSK vs RR: రాణించిన ఆయుష్, బ్రేవిస్.. రాజస్తాన్ రాయల్స్ టార్గెట్ ఎంతంటే
Preity zinta hugs Vaibhav: వైభవ్ సూర్యవంశీకి హగ్.. ప్రీతి జింటా స్పందన ఏంటంటే
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..