Lalit Modi about IPL 2008: అలా జరిగితే నాకు మరణమే.. ఆ మ్యాచ్ కోసం అన్ని రూల్స్‌నూ బ్రేక్ చేశాం..
ABN , Publish Date - Sep 04 , 2025 | 01:03 PM
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వెనుకున్న మాస్టర్ మైండ్ లలిత్ మోదీ. క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌ను ప్రారంభించి, దానిని విజయవంతం చేయడం వెనుక లలిత్ మోదీ కీలక పాత్ర పోషించారు. అయితే ఆయన మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటూ చాలా కాలం నుంచి లండన్‌లోనే నివసిస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వెనుకున్న మాస్టర్ మైండ్ లలిత్ మోదీ (Lalit Modi). క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌ను ప్రారంభించి, దానిని విజయవంతం చేయడం వెనుక లలిత్ మోదీ కీలక పాత్ర పోషించారు. అయితే ఆయన మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటూ చాలా కాలం నుంచి లండన్‌లోనే నివసిస్తున్నారు. చాలా కాలం సైలెంట్‌గా ఉన్న లలిత్ మోదీ ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఇటీవల హర్బజన్-శ్రీశాంత్ చెంపదెబ్బ ఎపిసోడ్ గురించి వెల్లడించి సంచలనం సృష్టించారు (IPL 2008).
ఐపీఎల్ ప్రారంభమైన 2008 సీజన్ తొలి మ్యాచ్ గురించి లలిత్ మోదీ తాజాగా మాట్లాడారు. 'తొలి మ్యాచ్ పైనే ఐపీఎల్ భవితవ్యం ఆధారపడి ఉంటుందని అర్థమైంది. ఆ మ్యాచ్ విజయవంతం కాకపోతే నేను మరణించినట్టే అని భావించా. ఆ మ్యాచ్‌ను విజయవంతం చేయడం కోసం ఎన్నో రూల్స్‌ను బ్రేక్ చేశా. ఆ సీజన్ బ్రాడ్‌కాస్టింగ్ కోసం సోనీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. అయితే సోనీకి దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ లేదు. కానీ, తొలి మ్యాచ్‌ను ప్రతి ఒక్కరూ చూడాలని నేను భావించాన'ని లలిత్ తెలిపారు (IPL broadcasting rules).
'తొలి మ్యాచ్ (IPL first match)ను బ్రాడ్‌కాస్టర్లు, న్యూస్ ఛానెళ్లు.. ఇలా అందరికీ లైవ్ ఇచ్చాం. అప్పుడు సోనీ మా మీద దావా వేస్తానంది. 'నా మీద మీరు దావా తరువాత వేద్దురు గానీ, ముందు లైవ్ స్టార్ట్ చేయండి' అని చెప్పి వచ్చేశా. తొలి మ్యాచ్ ఎంత మందికి రీచ్ అయితే ఐపీఎల్ భవిష్యత్తు అంత ఘనంగా ఉంటుందనుకున్నా. తొలి మ్యాచ్ ఫ్లాప్ అయితే నేను మరణించినట్టేనని భావించా' అంటూ లలిత్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
రోహిత్ శర్మ షాకింగ్ వెయిట్‌లాస్.. 95 నుంచి 75 కిలోలకు.. ఫాలో అయిన డైట్ ఇదే..
కోహ్లీ పాస్.. లండన్‌లో టెస్ట్‌కు అనుమతి ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..