Inter State T20 Cricket: రావినూతలలో అంతర్ రాష్ట్ర టీ20 కప్
ABN , Publish Date - Dec 26 , 2025 | 05:57 AM
అంతర్ రాష్ట్ర టీ20 సంక్రాంతి క్రికెట్ కప్‌నకు ఆతిథ్యం ఇచ్చేందుకు బాపట్ల జిల్లాలోని రావినూతల స్టేడియం ముస్తాబవుతోంది. వచ్చే...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): అంతర్ రాష్ట్ర టీ20 సంక్రాంతి క్రికెట్ కప్‌నకు ఆతిథ్యం ఇచ్చేందుకు బాపట్ల జిల్లాలోని రావినూతల స్టేడియం ముస్తాబవుతోంది. వచ్చే నెల 9 నుంచి 16వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. టోర్నీ మొత్తం ప్రైజ్ మనీ రూ.6 లక్షలు కాగా, విజేత జట్టుకు రూ.3 లక్షలు నగదు బహుమతిగా లభించనుంది. ఆసక్తి గల జట్లు ఈనెల 30వ తేదీ లోపు తమ వివరాలను నమోదు చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 9849533714, 9581022842 నెంబర్లను సంప్రదించి తెలుసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?
బంగ్లాదేశ్‌లో ఆగని అరాచకాలు.. మరో హిందువు దారుణ హత్య..