T20 World Record: ఒకే ఓవర్‌లో 5 వికెట్లు
ABN , Publish Date - Dec 24 , 2025 | 06:20 AM
ఇండోనేసియాకు చెందిన పేసర్ గెడె ప్రియందన అంతర్జాతీయ టీ20ల్లో సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. ఎనిమిది టీ20ల సిరీ్‌సలో భాగంగా కంబోడియాతో మంగళవారం జరిగిన...
టీ20ల్లో ప్రపంచ రికార్డు
ఇండోనేసియా బౌలర్ ప్రియందన సంచలనం
బాలి (ఇండోనేసియా): ఇండోనేసియాకు చెందిన పేసర్ గెడె ప్రియందన అంతర్జాతీయ టీ20ల్లో సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. ఎనిమిది టీ20ల సిరీ్‌సలో భాగంగా కంబోడియాతో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి అద్భుతహ.. అనిపించాడు. ప్రియందన (1-0-1-5) రికార్డు ప్రదర్శనతో ఆతిథ్య ఇండోనేసియా 60 పరుగులతో గెలిచింది. తొలుత ఇండోనేసియా.. ధర్మ కేసుమా (110 నాటౌట్) అజేయ సెంచరీతో 20 ఓవర్లలో 167/5 స్కోరు చేసింది. ఛేదనలో ప్రియందనకు తోడు అంజార్ (2/10), డానిస్లాన్ (2/17) వికెట్ల వేటలో చెలరేగడంతో కంబోడియా 16 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. 16వ ఓవర్‌లో బంతి తీసుకున్న ప్రియందన.. తొలి మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించాడు. నాలుగో బంతిని డాట్ బాల్‌గా వేసిన అతను..తర్వాత వైడ్ ఇచ్చుకున్నాడు. అనంతరం రెండు బంతుల్లో మరో ఇద్దరిని అవుట్ చేసి ఐదు వికెట్ల ప్రదర్శనను పూర్తి చేసుకున్నాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా 28 ఏళ్ల ప్రియందన చరిత్ర సృష్టించాడు. కాగా, గతంలో 2010 టీ20 ప్రపంచక్‌పలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఆమెర్ విసిరిన ఒక ఓవర్‌లో ఐదు వికెట్లు పతనమైనప్పటికీ.. వాటిలో రెండు రనౌట్లు ఉన్నాయి. దేశవాళీ టీ20ల్లో భారత్‌కు చెందిన అభిమన్యు మిథున్, బంగ్లాదేశ్ ఆటగాడు అల్ అమిన్ హొసైన్ ఈ ఘనత సాధించారు.
ఇవీ చదవండి:
టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లో దీప్తి శర్మ!
టీ20ల్లో నయా రికార్డు.. ఒకే ఓవర్‌లో 5 వికెట్లు