Share News

Womens Kabaddi: కబడ్డీ టైటిల్‌పోరుకు భారత్‌

ABN , Publish Date - Nov 24 , 2025 | 06:00 AM

భారత మహిళల జట్టు అద్భుతమైన ఆట తీరుతో కబడ్డీ వరల్డ్‌క్‌పలో ఫైనల్‌ చేరింది. సెమీఫైనల్‌ పోరులో భారత జట్టు 33-21తో బలమైన ఇరాన్‌ను ఓడించి, ట్రోఫీకి చేరువైంది...

Womens Kabaddi: కబడ్డీ టైటిల్‌పోరుకు భారత్‌

ఢాకా: భారత మహిళల జట్టు అద్భుతమైన ఆట తీరుతో కబడ్డీ వరల్డ్‌క్‌పలో ఫైనల్‌ చేరింది. సెమీఫైనల్‌ పోరులో భారత జట్టు 33-21తో బలమైన ఇరాన్‌ను ఓడించి, ట్రోఫీకి చేరువైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ అయిన భారత క్రీడాకారిణులు శత్రు దుర్భేద్యమైన డిఫెన్స్‌తో పాటు మెరుపు రైడ్లతో ప్రత్యర్థి ఇరాన్‌ను చిత్తు చేశారు. అంతకుముందు జరిగిన లీగ్‌ దశలోనూ గ్రూప్‌-ఎ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ విజయం సాధించడం విశేషం. సోమవారం జరిగే ఫైనల్లో చైనీస్‌ తైపీ జట్టుతో భారత అమ్మాయిలు తలపడనున్నారు.

ఇవీ చదవండి:

అంధ మహిళల టీ20 ప్రపంచకప్ భారత్‌దే.. జట్టుపై అభినందనలు..

ఊహించని పరిణామం.. స్మృతి మంధాన పెళ్లి వాయిదా..

Updated Date - Nov 24 , 2025 | 06:00 AM