Share News

Sultan Johor Cup Junior Hockey: కుర్రాళ్ల జోరుకు కళ్లెం

ABN , Publish Date - Oct 16 , 2025 | 04:08 AM

జూనియర్‌ సుల్తాన్‌ జొహర్‌ కప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న యువ భారత హాకీ జట్టు జోరుకు బ్రేక్‌ పడింది. తాజా టోర్నీలో భారత్‌ తొలి ఓటమిని రుచి చూసింది....

Sultan Johor Cup Junior Hockey: కుర్రాళ్ల జోరుకు కళ్లెం

  • ఆసీస్‌ చేతిలో యువ భారత్‌ ఓటమి

  • సుల్తాన్‌ జొహర్‌ కప్‌ జూనియర్‌ హాకీ

జొహర్‌ బహ్రు (మలేసియా): జూనియర్‌ సుల్తాన్‌ జొహర్‌ కప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న యువ భారత హాకీ జట్టు జోరుకు బ్రేక్‌ పడింది. తాజా టోర్నీలో భారత్‌ తొలి ఓటమిని రుచి చూసింది. బుధవారం ఇక్కడ జరిగిన పోరులో ఆస్ట్రేలియా 4-2తో భారత్‌ను ఓడించింది. మొత్తం నాలుగు మ్యాచ్‌లకుగాను రెండు విజయాలు, ఓ ఓటమి, ఓ డ్రాతో కలిపి ఏడు పాయింట్లతో భారత్‌ రెండోస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 10 పాయింట్లతో టాప్‌లో ఉంది. భారత్‌ తన తదుపరి మ్యాచ్‌ను శుక్రవారం ఆతిథ్య మలేసియాతో ఆడనుంది.

ఈ వార్తలు కూడా చదవండి...

జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు

ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 16 , 2025 | 04:09 AM