Under 19 Asia Cup: వైభవ్, ఆయుష్‌పైనే దృష్టి
ABN , Publish Date - Dec 12 , 2025 | 05:58 AM
వచ్చే ఏడాది జరిగే వరల్డ్‌క్‌పను దృష్టిలో ఉంచుకొని అండర్-19 ఆసియాకప్‌లో జట్టులోని లోపాలను సరిద్దుకోవాలని యువ భారత జట్టు భావిస్తోంది. వన్డే ఫార్మాట్‌లో...
యూఏఈతో భారత్ ఢీ నేడు
అండర్-19 ఆసియాకప్
ఉ. 10.30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో..
దుబాయ్: వచ్చే ఏడాది జరిగే వరల్డ్‌క్‌పను దృష్టిలో ఉంచుకొని అండర్-19 ఆసియాకప్‌లో జట్టులోని లోపాలను సరిద్దుకోవాలని యువ భారత జట్టు భావిస్తోంది. వన్డే ఫార్మాట్‌లో జరగనున్న ఆసియాక్‌పలో కొత్తతరం ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. గ్రూప్-ఎలో భారత్‌తోపాటు పాకిస్థాన్, యూఏఈ, మలేసియా జట్లున్నాయి. గ్రూప్-బిలో అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక టీమ్‌లు ఆడునున్నాయి. శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో యూఏఈతో ఆడనున్న భారత్.. ఆదివారం పాక్‌తో, మంగళవారం మలేసియాతో తలపడనుంది. అయితే, ఇటీవలి టోర్నీలో పాక్ ఆటగాళ్లతో భారత క్రికెటర్లు కరచాలనం చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో కూడా అలాగే వ్యవహరిస్తారా? అనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఇవీ చదవండి:
సహచరుడికి ఇచ్చిన మాట..15 ఏళ్ల తర్వాత నిలబెట్టుకున్న సచిన్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. నెం.2గా కోహ్లీ