ఒలింపిక్ విజేతకు షాకిచ్చారు
ABN , Publish Date - Feb 26 , 2025 | 05:23 AM
భారత మహిళల హాకీ జట్టు ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్‌లో అద్భుత విజయం సాధించింది. మంగళవారం జరిగిన పోరులో పారిస్ ఒలింపిక్స్ చాంపియన్, ప్రపంచ నెంబర్‌వన్ నెదర్లాండ్స్‌కు షాకిచ్చింది...

భారత హాకీ అమ్మాయిల అద్భుత విజయం
భువనేశ్వర్: భారత మహిళల హాకీ జట్టు ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్‌లో అద్భుత విజయం సాధించింది. మంగళవారం జరిగిన పోరులో పారిస్ ఒలింపిక్స్ చాంపియన్, ప్రపంచ నెంబర్‌వన్ నెదర్లాండ్స్‌కు షాకిచ్చింది. నిర్ణీత సమయానికి ఇరుజట్లు 2-2 గోల్స్‌తో నిలిచాయి. దీంతో ఫలితం తేల్చే షూటౌట్‌లో దీపిక, ముంతాజ్ చెరో గోల్ సాధించడంతో భారత్ 2-1తో డిఫెండింగ్ చాంప్ నెదర్లాండ్స్‌ను చిత్తుచేసింది. షూటౌట్‌లో డచ్ తరఫున ఏకైక గోల్‌ను మార్జిన్ వీన్ చేసింది. వెటరన్ గోల్‌కీపర్ సవిత పూనియా ప్రత్యర్థి నాలుగు గోల్స్ ప్రయత్నాలను సమర్ధ వంతంగా అడ్డుకొని భారత్ విజయంలో కీలకపాత్ర పోషించింది.
హెచ్‌ఐ నజరానా: ఒలింపిక్ విజేత నెదర్లాండ్స్‌ను ఓడించిన భారత . జట్టులోని ప్రతి సభ్యురాలికి రూ. లక్ష చొప్పున, సహాయ సిబ్బందికి తలో రూ. 50 వేలు రివార్డు ఇవ్వనున్నట్టు హాకీ ఇండియా (హెచ్‌ఐ) ప్రకటించింది.
ఇవీ చదవండి:
టాస్ పడకుండానే మ్యాచ్ రద్దు.. సెమీస్‌పై సస్పెన్స్ కంటిన్యూ
భార్య గురించి షాకింగ్ విషయం చెప్పిన చాహల్..
భారత్ విజయంపై పాక్ వక్రభాష్యం.. విజయానికి కారణం అదేనట..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి