Chess Tournament: అర్జున్ విజయం
ABN , Publish Date - Sep 06 , 2025 | 03:42 AM
ఫిడే గ్రాండ్ స్విస్ చెస్ టోర్నీ రెండో రౌండ్‌లో ఇరిగేసి అర్జున్.. ఆర్మేనియా ఆటగాడు మార్టిరోస్యన్‌పై విజయం సాధించాడు. అలాగే 15 ఏళ్ల ఇవాన్ జెమ్లాన్‌స్కీ (రష్యా)పై ప్రజ్ఞానంద నెగ్గాడు...
సమర్‌ఖండ్: ఫిడే గ్రాండ్ స్విస్ చెస్ టోర్నీ రెండో రౌండ్‌లో ఇరిగేసి అర్జున్.. ఆర్మేనియా ఆటగాడు మార్టిరోస్యన్‌పై విజయం సాధించాడు. అలాగే 15 ఏళ్ల ఇవాన్ జెమ్లాన్‌స్కీ (రష్యా)పై ప్రజ్ఞానంద నెగ్గాడు. మహిళల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ వైశాలి.. ఎలినే రోబర్స్ (నెదర్లాండ్స్)ను ఓడించింది. ఇక 14 ఏళ్ల చిచ్చరపిడుగు యాగిజ్ కాన్ (తుర్కియే)తో తలపడిన ప్రపంచ చాంపియన్ గుకేశ్ డ్రాతో సరిపెట్టుకున్నాడు. భారత ఆటగాళ్లు విదిత్ గుజరాతీ-అభిమన్యు మధ్య జరిగిన గేమ్ కూడా డ్రాగా ముగిసింది.
ఇవి కూడా చదవండి..
ఈడీ ముందుకు శిఖర్ ధవన్.. బెట్టింగ్ యాప్ కేసులో విచారణ..
కోహ్లీ పాస్.. లండన్‌లో టెస్ట్‌కు అనుమతి ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..