Southampton ODI: ఇంగ్లండ్ 258 6
ABN , Publish Date - Jul 17 , 2025 | 04:13 AM
సోఫియా డంక్లే (83), అలిస్ డేవిడ్‌సన్ రిచర్డ్స్ (53) అర్ధ శతకాలతో ఆదుకోవడంతో.. ఇంగ్లండ్ మహిళల జట్టు తడబడి నిలబడింది. భారత్‌తో బుధవారం జరిగిన తొలి వన్డేలో...
భారత మహిళలతోతొలి వన్డే
సౌతాంప్టన్: సోఫియా డంక్లే (83), అలిస్ డేవిడ్‌సన్ రిచర్డ్స్ (53) అర్ధ శతకాలతో ఆదుకోవడంతో.. ఇంగ్లండ్ మహిళల జట్టు తడబడి నిలబడింది. భారత్‌తో బుధవారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 258 పరుగులు చేసింది. కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్ (41) ఫర్వాలేదనిపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. పేసర్ క్రాంతి దెబ్బకు ఓపెనర్లు అమీ జోన్స్ (1), టామీ బ్యూమాంట్ (5) వికెట్లను చేజార్చుకొంది. అయితే, ఎమ్మా ల్యాంబ్ (39), బ్రంట్ రెండో వికెట్‌కు 71 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ కోలుకొంది. నిలకడగా సాగుతున్న సమయంలో స్పిన్నర్ రాణా తన వరుస ఓవర్లలో వీరిద్దరినీ పెవిలియన్ చేర్చడంతో ఇంగ్లండ్ 97/4తో ఇబ్బందుల్లో పడినట్టుగా కనిపించింది. ఈ దశలో అలిస్ సహకారంతో డంక్లే స్కోరు బోర్డును నడిపించింది. అయితే, అలిస్‌ను అవుట్ చేసిన శ్రీచరణి.. ఐదో వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యాన్ని బ్రేక్ చేసింది. డెత్ ఓవర్లలో డంక్లేకు ఎకెల్‌స్టోన్ (23 నాటౌట్) జత కలవడంతో.. స్కోరు సునాయాసంగా 250 మార్క్ దాటింది. ఇన్నింగ్స్ చివరి బంతికి డంక్లేను అమన్‌జోత్ బౌల్డ్ చేసింది.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి