Archery World Championship: గాథ పోరు ముగిసె
ABN , Publish Date - Sep 13 , 2025 | 02:31 AM
ఆర్చరీ ప్రపంచ చాంపియన్‌షిప్స్ రికర్వ్ విభాగంలో భారత్‌కు ఈసారీ నిరాశ తప్పలేదు. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ప్రీక్వార్టర్స్ చేరి టైటిల్‌పై ఆశలు రేపిన 15 ఏళ్ల గాథ ఖడాకే...
నెంబర్‌వన్ చేతిలో ఓటమి
ఆర్చరీ ప్రపంచ చాంపియన్‌షిప్స్
గ్వాంగ్జు (దక్షిణ కొరియా): ఆర్చరీ ప్రపంచ చాంపియన్‌షిప్స్ రికర్వ్ విభాగంలో భారత్‌కు ఈసారీ నిరాశ తప్పలేదు. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ప్రీక్వార్టర్స్ చేరి టైటిల్‌పై ఆశలు రేపిన 15 ఏళ్ల గాథ ఖడాకే పోరాటం ముగిసింది. ప్రపంచ నెంబర్‌వన్, పారిస్ ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాల విజేత లిమ్ షియోన్ (కొరియా)తో జరిగిన పోరులో గాథ 0-6తో ఓటమిపాలైంది. ప్రపంచ చాంపియన్‌షిప్స్ రికర్వ్ విభాగంలో భారత్ చివరిసారిగా 2019లో పురుషుల జట్టు రజతం నెగ్గింది. కాగా, ఈసారి టోర్నీలో కాంపౌండ్ ఈవెంట్‌లో పురుషుల జట్టు స్వర్ణం, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో జ్యోతి సురేఖ/రిషభ్ జోడీ రజతం నెగ్గిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్... నామినీగా మహ్మద్ సిరాజ్
ఎందుకంత కోపం.. నేను నిజం మాత్రమే చెప్పాను: లలిత్ మోదీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి