India Women Hockey: అమ్మాయిలు అదిరేలా
ABN , Publish Date - Sep 06 , 2025 | 03:53 AM
ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో సొంతగడ్డపై భారత పురుషుల జట్టు సత్తా చాటుతుంటే.. ఇదే జోరులో విదేశీ గడ్డపై మన అమ్మాయిలూ అదరగొడుతున్నారు. మహిళల ఆసియా కప్‌ను భారత జట్టు అద్భుత విజయంతో...
థాయ్‌లాండ్‌పై 11-0తో భారత్ విజయం
మహిళల ఆసియా కప్ హాకీ
హాంగ్జౌ (చైనా): ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో సొంతగడ్డపై భారత పురుషుల జట్టు సత్తా చాటుతుంటే.. ఇదే జోరులో విదేశీ గడ్డపై మన అమ్మాయిలూ అదరగొడుతున్నారు. మహిళల ఆసియా కప్‌ను భారత జట్టు అద్భుత విజయంతో ప్రారంభించింది. పూల్-బిలో భాగంగా శుక్రవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో భారత్ 11-0తో థాయ్‌లాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఉదితా దుహాన్ (30వ, 52వ), డంగ్ డంగ్ (45వ, 54వ) చెరో రెండు గోల్స్‌తో విజృంభించగా.. ముంతాజ్ (7వ), సంగీతా కుమారి (10వ), నవ్‌నీత్ కౌర్ (16వ), లాల్‌రేమ్‌సియామి (18వ), సుమన్ దేవి (49వ), షర్మిలా దేవి (57వ), రుతజా పిసల్ (60వ) తలో గోల్ కొట్టారు. భారత్ తన రెండో మ్యాచ్‌ను శనివారం జపాన్‌తో ఆడనుంది.
ఇవి కూడా చదవండి..
ఈడీ ముందుకు శిఖర్ ధవన్.. బెట్టింగ్ యాప్ కేసులో విచారణ..
కోహ్లీ పాస్.. లండన్‌లో టెస్ట్‌కు అనుమతి ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..