India Australia Women Cricket: ప్రతీకారం తీరేనా
ABN , Publish Date - Sep 14 , 2025 | 05:06 AM
గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో భారత మహిళల జట్టుకు వన్డేల్లో 0-3తో ఘోర పరాభవం ఎదురైంది. ఇప్పుడు ఆ ఓటమికి హర్మన్‌ప్రీత్ సేన స్వదేశంలో...
నేడు ఆసీస్‌తో భారత మహిళల వన్డే
మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
ముల్లన్‌పూర్ (చండీగఢ్): గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో భారత మహిళల జట్టుకు వన్డేల్లో 0-3తో ఘోర పరాభవం ఎదురైంది. ఇప్పుడు ఆ ఓటమికి హర్మన్‌ప్రీత్ సేన స్వదేశంలో బదులు తీర్చుకోవాలనుకుంటోంది. ఆదివారం నుంచి ఇరుజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ మ్యాచ్‌లను రానున్న వన్డే వరల్డ్‌కప్ సన్నాహకంగానూ ఉపయోగించుకోవాలని భారత్ భావిస్తోంది. ఇటీవలి కాలంలో భారత మహిళలు ఐర్లాండ్, శ్రీలంకలో ముక్కోణపు సిరీస్, ఇంగ్లండ్‌తో వన్డే, టీ20ల్లో సిరీ్‌సలను గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇదే ఊపులో అలీసా హీలీ సారథ్యంలోని ఆసీస్‌పై పైచేయి సాధించాలనుకుంటున్నారు. ఇక, 9 నెలల విరామం తర్వాత భారత పేసర్ రేణుకా సింగ్ బరిలోకి దిగబోతోంది.
ఇవి కూడా చదవండి
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్... నామినీగా మహ్మద్ సిరాజ్
ఎందుకంత కోపం.. నేను నిజం మాత్రమే చెప్పాను: లలిత్ మోదీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి