Share News

చరిత్ర సృష్టించిన భారత్‌

ABN , Publish Date - Jul 11 , 2025 | 02:09 AM

భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి ఇంగ్లండ్‌పై టీ20 సిరీస్‌ విజయాన్ని నమోదు చేసింది. బుధవారం రాత్రి జరిగిన నాలుగో మ్యాచ్‌లో...

చరిత్ర సృష్టించిన భారత్‌

  • నాలుగో టీ20లో హర్మన్‌ సేన గెలుపు

  • ఇంగ్లండ్‌పై తొలి టీ20 సిరీస్‌ విజయం

మాంచెస్టర్‌: భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి ఇంగ్లండ్‌పై టీ20 సిరీస్‌ విజయాన్ని నమోదు చేసింది. బుధవారం రాత్రి జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఐదు టీ20ల సిరీ్‌సను 3-1తో మరో మ్యాచ్‌ మిగిలుండగానే సొంతం చేసుకొంది. స్పిన్నర్లు రాధా యాదవ్‌ (2/15), తెలుగమ్మాయి శ్రీచరణి (2/30), దీప్తి శర్మ (1/29) తిప్పేయడంతో.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 126/7 స్కోరుకే పరిమితమైంది. భారత ఫీల్డింగ్‌ కూడా మెరుగ్గా ఉండడంతో ఇంగ్లండ్‌ పరుగుల కోసం తీవ్రంగా శ్రమించింది. డంక్లే (22), బ్యూమాంట్‌ (20) టాప్‌ స్కోరర్లు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ 17 ఓవర్లలో 4 వికెట్లకు 127 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (32), స్మృతి మంధాన (31) తొలి వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యంతో అదిరే ఆరంభాన్నిచ్చారు. ఆ తర్వాత జెమీమా (24 నాటౌట్‌), హర్మన్‌ప్రీత్‌ (26) ఆచితూచి ఆడుతూ జట్టును గెలుపు తీరాలకు చేర్చారు.

ఇవి కూడా చదవండి

ఇన్‎కం ట్యాక్స్ 2025 కొత్త రూల్స్.. ఈ అప్‌డేట్ ప్రక్రియ తప్పనిసరి

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 11 , 2025 | 02:09 AM