India Women Cricket: జోరు సాగనీ
ABN , Publish Date - Dec 28 , 2025 | 06:06 AM
హ్యాట్రిక్ విజయాలతో ఇప్పటికే శ్రీలంకతో టీ20 సిరీ్‌సను కైవసం చేసుకొన్న భారత మహిళల జట్టు తర్వాతి మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలనుకొంటోంది...
ఆత్మవిశ్వాసంతో భారత్
రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
బోణీ కొట్టాలని శ్రీలంక
మహిళల నాలుగో టీ20 నేడు
తిరువనంతపురం: హ్యాట్రిక్ విజయాలతో ఇప్పటికే శ్రీలంకతో టీ20 సిరీ్‌సను కైవసం చేసుకొన్న భారత మహిళల జట్టు తర్వాతి మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలనుకొంటోంది. ఐదు మ్యాచ్‌ల సిరీ్‌సలో భాగంగా ఆదివారం జరిగే నాలుగో టీ20లో లంకతో హర్మన్‌ప్రీత్ సేన తలపడనుంది. అయితే, గత మూడు మ్యాచ్‌ల్లో మెరుగ్గా రాణించిన భారత బౌలర్లు 130 లోపే ప్రత్యర్థిని కట్టడి చేశారు. దీంతో మన బ్యాటర్లకు కఠిన పరీక్ష ఎదురుకాలేదు. అయితే, టాస్ కూడా మనోళ్లకు కలిసొచ్చింది. దీంతో మంచు ప్రభావం పెద్దగా పడలేదు. తొలి రెండు మ్యాచ్‌ల్లో అరుంధతి అంతగా రాణించలేక పోవడంతో మూడో టీ20లో రేణుకా సింగ్‌కు అవకాశం కల్పించారు. స్పిన్నర్లు దీప్తీశర్మ, వైష్ణవి శర్మ బ్యాటర్లను కట్టడి చేశారు. ఇక, బ్యాటింగ్‌లో స్మృతి మంధాన తన స్థాయికి తగ్గ ఆట తీరును ఇప్పటివరకు ప్రదర్శించలేదు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో మొత్తం 40 పరుగులే చేసింది. ఆమె నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. టాపార్డర్‌లో షఫాలీ అదరగొడుతుండడంతో మిగతా వారికి పనిలేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో యువ బ్యాటర్లు కమలిని, హర్లీన్‌ను తుది జట్టులోకి తీసుకొనే చాన్సుంది. మరోవైపు లంక జట్టు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతోంది. కెప్టెన్ చమరి ఆటపట్టు, హర్షిత, హాసిని విఫలమవుతున్నారు. బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ ఆ జట్టు మెరుగుపడాలి.
ఇవి కూడా చదవండి
తనను ఔట్ చేసిన బౌలర్‌కు విరాట్ అదిరిపోయే గిఫ్ట్!
ఇది మాకు ఎంతో ప్రత్యేకం.. తమ చారిత్రక విజయంపై స్టోక్స్