Ind Vs WI Test Live: వెస్టిండీస్ తడబాటు.. తొలి ఇన్నింగ్స్‌లో స్కోరు ఇదీ
ABN , Publish Date - Oct 02 , 2025 | 03:27 PM
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ 162 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక స్వల్ప స్కోరుకే పరిమితమైంది.
ఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భారత బౌలర్ల ధాటికి వెస్టిండీస్ తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 162 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ భారత బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ పేక మేడలా కూలిపోయింది. ఓపెనర్లు త్యాగ్ నారాయణ్ చందర్‌పాల్ (0), జాన్ క్యాంప్‌బెల్ (8) కీలక సమయాల్లో పెవిలియన్ బాట పట్టారు (Ind Vs WI Test Match Live Score).
మిడిల్ ఆర్డర్ కాస్త పోరాడినా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. జస్టిన్ గ్రీవ్స్ (32), రాస్టన్ ఛేజ్ (24), షాయ్ హోపు (26) రెండంకెల స్కోరు చేయగలిగినా చివరకు భారత బౌలర్ల ధాటికి త్వరగానే వికెట్లు సమర్పించుకున్నారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ ఏకంగా 4 వికెట్లు తీసి వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలేలా చేశాడు. ఇక జస్‌ప్రీత్ బుమ్రా (3), కుల్‌దీప్ యాదవ్ (2), వాషింగ్టన్ సుందర్ (1) కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ప్రస్తుతం తన తొలి ఇన్నింగ్స్‌ను మొదలెట్టిన భారత్ 2.4 ఓవర్లు ముగిసేసరికి 23 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఓపెనర్లు యశశ్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి
ట్రోఫీ తీసుకెళ్లిపోయిన పీసీబీ చీఫ్.. మండిపడ్డ బీసీసీఐ సెక్రెటరీ
పాక్ క్రికెట్‌లో సంక్షోభం.. నఖ్వీ రాజీనామా చేయాలని అఫ్రీది డిమాండ్..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి