Ind Vs WI Live: లంచ్ బ్రేక్.. బ్యాటర్లు మరోసారి విఫలం.. చిక్కుల్లో వెస్టిండీస్
ABN , Publish Date - Oct 04 , 2025 | 11:59 AM
మూడో రోజు కూడా వెస్టీండీస్ చతికిలపడిపోయింది. లంచ్ బ్రేక్ సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 66 పరుగులు మాత్రమే చేసి చిక్కుల్లో పడిపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో వెస్టిండిస్ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. భారత బౌలర్లు విజృంభించడంతో లంచ్‌కు ముందే వెస్టిండీస్ కీలక బ్యాటర్లు వెనుదిరిగారు. ఒకానొక దశలో 46 పరుగల వద్ద ఏకంగా 5 వికెట్లు జార విడుచుకుని చిక్కుల్లో పడిపోయింది (Ind Vs WI Day 3 Live Updates).
రెండో రోజున ఐదు వికెట్ల నష్టానికి 448 పరుగుల ఓవర్‌నైట్ స్కోరు సాధించిన భారత్ తన ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. విండిస్‌కు 286 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో తమ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వెస్టిండీస్ బ్యాటర్లు మరోసారి దారుణంగా విఫలమయ్యారు.
ఆదిలోనే చంద్రాల్ తన వికెట్ సమర్పించుకోవడంతో 12 పరుగుల వద్ద విండీస్‌కు తొలి దెబ్బ తిగిలింది. సిరాజ్ బౌలింగ్‌లో నితీశ్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి అతడు వెనుదిరిగాడు. ఆ తరువాత రవీంద్ర జడేజా మూడు వికెట్లు, కుల్‌దీప్ యాదవ్ మరో వికెట్ తీయడంతో విండోస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. లంచ్ సమయానికి వెస్టిండీస్ 5 వికెట్ల నష్టానికి కేవలం 66 పరుగులు మాత్రమే చేయగలిగింది. 220 పరుగులు మేర వెనకబడి చిక్కుల్లో పడిపోయింది.
ఇవి కూడా చదవండి
పాక్ క్రికెట్‌లో సంక్షోభం.. నఖ్వీ రాజీనామా చేయాలని అఫ్రీది డిమాండ్..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి